జిల్లాలో డ్రగ్స్ ను సమూలంగా రూపుమాపాలి.

 *జిల్లాలో డ్రగ్స్ ను సమూలంగా రూపుమాపాలి


*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), జూన్ 28 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాలుగు నెలల్లోగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ మార్చాలని ఆదేశించడం జరిగిందని, అందులో భాగంగా ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు జిల్లాలో డ్రగ్స్ ను సమూలంగా రూపుమాపాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మత్తు పదార్థాలు & మాదక ద్రవ్యాల నివారణ (నార్కోటిక్స్ డ్రగ్స్ & సైకోట్రోపిక్ పదార్థాలు, ఎన్డిపిఎస్)పై జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ సంస్కృతి ఇప్పుడిప్పుడే మొదలవుతోందని, డ్రగ్స్ సంస్కృతి వ్యాప్తి చెందకుండా ఆదిలోనే అరికట్టాలన్నారు. జిల్లాలోని కదిరి ప్రాంతంలో డ్రగ్స్ కేసులు వస్తున్నాయని, ఈ ప్రాంతంలో డ్రగ్స్ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని పరిశ్రమల ప్రాంతాల్లో డ్రగ్స్ వాడకంపై నిఘా పెట్టాలని, సరిహద్దులు, పరిశ్రమల ప్రాంతాల్లో నాకాబందీ పెట్టాలన్నారు. డ్రగ్స్ సరఫరా మూలాలు ఎక్కడున్నాయి అనేది కనిపెట్టాలని, అనంతరం ఆ మూలాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పూర్తిస్థాయిలో డ్రగ్స్ ను రూపుమాపాలన్నారు. జిల్లాలోకి ఎలాంటి డ్రగ్స్ ప్రవేశించకుండా చేపడుతున్న యాక్టివిటీలను కొనసాగించాలని, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత యాక్టివిటీలు బాగా చేస్తున్నారని జిల్లా ఎస్పీని, వారి సిబ్బందిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.


ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ ను అరికట్టేందుకు చేపడుతున్న యాక్టివిటీలను కొనసాగిస్తామన్నారు. జిల్లాలో డ్రగ్స్ ప్రవేశించకుండా నిత్యం మానిటరింగ్ నుంచి చేస్తున్నామన్నారు. డ్రగ్స్ మూలాలు వైజాగ్ లోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయని, అక్కడ నుంచి వస్తున్న సప్లై చైన్ పై నిఘా పెడుతున్నామన్నారు. జిల్లాలో పాఠశాలలో, కాలేజీలపై క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నామన్నారు. రైల్వేను డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఉపయోగించుకుంటున్నారని, రైల్వే సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎవరూ డ్రగ్స్ వాడకుండా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.


ఈ సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, అడిషినల్ ఎస్పీ విష్ణు, ఆర్డీఓలు భాగ్యరేఖ, తిప్పేనాయక్, రాఘవేంద్ర, బిసి వెల్ఫేర్ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, డిటిడబ్ల్యువో మోహన్ రామ్, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ గోవింద్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, సోషల్ వెల్ఫేర్ డిడి శివరంగ ప్రసాద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ అనుపమ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments