సంక్షోభంలో రవాణా రంగం...ఆదుకోండి:-

 

సంక్షోభంలో రవాణా రంగం...ఆదుకోండి:-


టీడీపీ అధినేతకు ఎపి లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతల విన్నపం


అమరావతి (ప్రజా అమరావతి):- టీడీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఎపి లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రవాణా రంగంలో ఏర్పడిన సంక్షోభం, తాము పడుతున్న ఇబ్బందులను టీడీపీ అధినేతకు వివరించారు. డీజిల్, పెట్రోల్ పై రోడ్డు సెస్ కింద రూపాయి వసూలు చేస్తున్నారని, రోడ్ల మరమ్మతులు లేవని, ఓవర్ హైట్ కేసుల పెనాల్టీ గతంలో రూ.1000  ఉంటే నేడు రూ. 20 వేలు చేశారని వివరించారు. కరోనా సమయంలో అన్ని రాష్ట్రాలు లారీ యజమానులకు క్వార్టర్ టాక్స్ మినహాయింపు ఇస్తే మన రాష్ట్రం మాత్రం మినహాయింపు ఇవ్వలేదని తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ ను రూ. 200 నుంచి రూ. 20,000 పెంచిన కారణంగా రవాణా రంగం తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. మరోవైపు క్వార్టర్లీ ట్యాక్స్ ను కూడా 25 శాతం నుంచి 30 శాతం కు పెంచడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను చంద్రబాబు నాయుడుకు వివరించారు. టీడీపీ మానిఫెస్టోలో రవాణా రంగాన్ని ఆదుకునేందుకు అవసరం అయిన నిర్ణయాలు ప్రకటించాలని ఈ సందర్భంగా వారు చంద్రబాబు నాయుడుని కోరారు.

Comments