అట్టహాసంగా "ప్రత్యూష వెనిగండ్ల - జెరెమీ బలెమల" వివాహ నిశ్చితార్థ వేడుక.

 *- అట్టహాసంగా "ప్రత్యూష వెనిగండ్ల - జెరెమీ బలెమల" వివాహ నిశ్చితార్థ వేడుక*


- *ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు*

*- సుఖద - రాము వెనిగండ్ల ద్వితీయ కుమార్తె 'ప్రత్యూష'*

- *జ్యోతి జెరూషా - ఇమ్మానియేల్ ఇస్సాక్ ల ప్రధమ పుత్రుడు 'జెరెమీ'* 

 *- రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులతో కళకళలాడిన హైదరాబాద్ నార్సింగిలోని అడ్రస్ కన్వెన్షన్*హైదరాబాద్ (నార్సింగి), జూన్ 24 (ప్రజా అమరావతి):

కృష్ణాజిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము ద్వితీయ కుమార్తె ప్రత్యూష వివాహ నిశ్చితార్థ వేడుకలు హైదరాబాద్ నార్సింగిలోని అడ్రస్ కన్వెన్షన్లో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఈ వివాహ నిశ్చితార్థ మహోత్సవానికి  తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు హాజరయ్యారు. సుఖద - రాము వెనిగండ్ల కుమార్తె 'ప్రత్యూష'తో, జ్యోతి జెరూషా - ఇమ్మానియేల్ ఇస్సాక్ ల ప్రధమ పుత్రుడు 'జెరెమీ బలెమల'కు వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ మహోత్సవానికి విచ్చేసిన శ్రీ అచ్చెన్నాయుడు గారితో పాటు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు "ప్రత్యూష, జెరెమీ బలెమల"ను ఆశీర్వదించారు. అనంతరం సుఖద - రాము వెనిగండ్ల, జ్యోతి జెరూషా - ఇమ్మానియేల్ ఇస్సాక్ ల కుటుంబ సభ్యులు, బంధువులతో శ్రీ అచ్చెన్నాయుడు గారు కాసేపు ముచ్చటించారు. కాగా, ప్రత్యూష, జెరెమీ బలెమల నిశ్చితార్థ మహోత్సవ ఏర్పాట్లు అంబరాన్నంటాయి. బంధుమిత్రుల సమక్షంలో కన్నుల పండుగగా జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రముఖులు విచ్చేసి నవ వధూవరులు "ప్రత్యూష, జెరెమీ బలెమల"కు ఆశీస్సులను అందజేశారు. ఆశీస్సులు అందజేసిన వారిలో టీవీ5 అధినేత బిఆర్ నాయుడు, ప్రముఖులు దేవినేని ఉమా, బొండా ఉమా, పట్టాభి, గద్దె రామ్మోహన్, కేశినేని చిన్ని, రావి వెంకటేశ్వరావు, బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్, కొనకళ్ళ బుల్లయ్య, వర్ల కుమార్ రాజా, చలసాని ఆంజనేయులు, యలవర్తి శ్రీనివాసరావు, వసంతవాడ దుర్గారావు, నెరుసు చింతయ్య, కఠారి ఈశ్వర్ కుమార్, చింతమనేని ప్రభాకర్, గుత్తా చంటి, అడుసుమిల్లి లక్ష్మణరావు, జేమ్స్, పందిళ్ళ మల్లి, నల్లగంచు రాంబాబు, నూతక్కి బాలాజీ, పల్లెబాట రాజా, బొంబాయి శ్రీను, కడియాల గణేష్ తదితరులు ఉన్నారు.

Comments