*జగనన్న సురక్ష కార్యక్రమం కింద ఇంటింటికీ వెళ్ళాలి*
*: సర్వీస్ ల నమోదు మరింత పెంచాలి*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
*: సోమందేపల్లి మండలంలోని వెలుగమేకలపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
సోమందేపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా), జూన్ 27 (ప్రజా అమరావతి):
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న సురక్ష కార్యక్రమం కింద సర్వీస్ ల నమోదు మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. మంగళవారం సోమందేపల్లి మండలంలోని వెలుగమేకలపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్ల సర్వేను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం పరిధిలో వాలంటీర్లు ఇంటింటికి ఖచ్చితంగా తిరగాలన్నారు. రిక్వెస్ట్ లు ఇక్కడ తక్కువగా ఉన్నాయని రిక్వెస్ట్ లను మరిన్ని పెంచాలన్నారు. అర్హత ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే అలాంటి వారికి లబ్ధి చేకూర్చాలని, ఆగస్టులో ఇచ్చే ద్వైవార్షిక నగదు పంపిణీలో పథకాల లబ్ధి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో అందే సేవల గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇంటింటా తెలియజేయలన్నారు. గ్రామాల్లో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళలో అందుబాటులో ఉంటారని, మధ్యాహ్నం వేళల్లో పొలం పనులు, ఇతర పనులకు వెళుతూ ఉంటారని, అందువల్ల ఉదయం సాయంత్రం వేళ ఇంటింటికి వెళ్లి జగనన్న సురక్ష సర్వేను పూర్తి చేయాలన్నారు. గ్రామంలో హౌస్ హోల్డ్ సర్వే 660 పూర్తి చేయగా, సర్వీస్ ల నమోదు ఎక్కువగా జరగలేదని, మరిన్ని సర్వీసులను నమోదు చేయాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు వారితో స్నేహభావంతో మాట్లాడాలని, ప్రభుత్వం ఉచతంగా అందించే 11 రకాల సేవలను ఇంటింటా తెలియ చేయాలన్నారు. గ్రామంలో క్యాంప్ జరిగే తేదీనీ అందరికి తెలియజేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు పథకాలలో వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ విద్య కానుక , విద్య దీవెన, వసతి దీవెన, వైయస్సార్ చేయూత , అమ్మ ఒడి, కాపు నేస్తం, వాహన మిత్ర తదితర పథకాల గురించి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీపీ, సర్పంచ్, సచివాలయ సిబ్బంది, వాలంటిర్ లు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment