బాలల సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి .... కేసలి అప్పారావు

 అమరావతి / మంగళగిరి (ప్రజా అమరావతి);

  


బాలల సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి 

               .... కేసలి అప్పారావు


                     

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని బాలలు కోసము నిర్వహించబడుతున్న బాలల కోసము నిర్వహించబడుతున్న పునరావాస కేంద్రాలు, సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు తెలిపారు.ఈ సందర్భంగా ఈ రోజు మంగళగిరి లో గల కమిషన్ కార్యాలయంలో సభ్యులు.  కమిషన్ సభ్యులు జంగం రాజేంద్ర ప్రసాద్ , గోండు సీతారాం,త్రిపర్ణ అది లక్ష్మి,బత్తుల పద్మావతి,ఏం.లక్ష్మి దేవి తో కలిసి  సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మరియు సభ్యులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు,సంఘాలు స్వచ్ఛంద సంస్థలు బాలికలు మరియు బాలురు తో కేంద్రాలను నిర్వహిస్తున్నారని కమిషన్ దృష్టికి వచ్చిందని అన్నారు. బాలల న్యాయ చట్టం ప్రకారం అనుమతి తీసుకోవాలని ,నిభందనలు ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా కేంద్రాలను నిర్వహిస్తే కఠీన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

అంతే కాకుండా విద్యా హక్కు చట్టం ప్రకారం నిరుపేద కుటుంబానికి సంబందించి వారికి కేటాయించిన సీట్లను వారితోనే భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.వీటి మీద కూడా ప్రత్యక పర్యవేక్షణ చేయడం జరుగుతుందని తెలిపారు.


          సమీక్ష సమావేశం అయిన తరువాత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఉషా శ్రీ చరణ్,,సెక్రెటరీ జీ.జయలక్ష్మి మరియు డైరెక్టర్ శ్రీమతి విజయ సునీత ని కలిసి బాలల హక్కుల పరిరక్షణ కోసము  కమిషన్ అనుసరిస్తున్న విధానం గురించి చర్చించారు.

Comments