మచిలీపట్నం : జూన్ 21 (ప్రజా అమరావతి);
*భారతీయ సంస్కృతి నుంచి లభించిన అమూల్య బహుమతి యోగా !!
*
*--- ముడా చైర్పర్సన్ బొర్రా నాగ దుర్గ భవాని విఠల్*
ఆరోగ్య సంరక్షణకు భారతీయ సంస్కృతి నుంచి లభించిన అమూల్య బహుమతి యోగా అని మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ బొర్రా నాగ దుర్గా భవాని విఠల్ పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్థానిక పోలీస్ కవాతు మైదానంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు భారత ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముడా చైర్పర్సన్ ప్రసంగిస్తూ, భారతీయ సామాజిక సాంస్కృతిక వారసత్వాన్ని సూచించే వసుదైవ కుటుంబానికి యోగ అనే ఇతివృత్వంతో 9 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకోవడం గొప్ప విషయం అని ఈ సందర్భంగా అన్నారు. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భారతీయ ప్రాచీనమైన, అమూల్యమైన, విశిష్టమైన ఈ యోగ ప్రక్రియ గురించి తెలియజేశారన్నారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంను అధికారికంగా ప్రకటించడం గొప్ప విశేషం అన్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకోవడం గమనార్హమన్నారు.
యోగా కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో పుట్టిందని, ఇక్కడి ఋగ్వేదాలు, పౌరాణిక పుస్తకాలలో సైతం యోగా గురించి ప్రస్తావించబడిందని ముడా చైర్పర్సన్ తెలిపారు. యోగాకు ముందు గురువే శివుడని చెబుతారని. మనస్సు, శరీరం మధ్య సామరస్యాన్ని తీసుకురావడానికి యోగా పనిచేస్తుందని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విఠల్ రావు, కృష్ణాజిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిణి ఝాన్సీ లక్ష్మి, డి వై ఈ ఓ యు.వి. సుబ్బారావు, ఏ ఆర్ డిఎస్పి మాధవ రెడ్డి,గురునాథ్ బాబు, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు .
addComments
Post a Comment