టిడ్కో గృహాల విషయంలో వైసీపీ ఎంత ప్రచారం చేసుకున్నా వర్కవుట్ కాలేదు.

 *- టిడ్కో గృహాల విషయంలో వైసీపీ ఎంత ప్రచారం చేసుకున్నా వర్కవుట్ కాలేదు


 *- చంద్రబాబు హయాంలోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయి* 

 *- వాటికి రంగులేయడం వరకు ప్రజలు చూస్తూనే ఉన్నారు* 

 *- డబ్బులు కట్టించుకుని కొంత మందిని మోసం చేశారు* 

 *- ఆ బాధను, ఆక్రోశాన్ని వెళ్ళగక్కే ప్రయత్నమే జరిగింది* 

 *- నిరసన తెలియజేస్తే ఇంత హడావుడి చేయడమెందుకు* 

 *- ఏదో విధంగా ఇళ్ళొస్తున్నాయని ఆనందంలో ఉన్నాం* 

 *- అందుకే టిడ్కో ఇళ్ళ పంపిణీని ఏ మాత్రం వ్యతిరేకించనే లేదు*

 *- రంగులేసుకుని ఇళ్ళివ్వడానికి ఇంత హడావుడి చేయాలా* 

 *- అదుపులో ఉన్నవారి భద్రతపై ఆందోళనతో ఉన్నాం* 

 *- పోలీసులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం* 

 *- మీడియాతో తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము* 



గుడివాడ, జూన్ 16 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని పేదల కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎంత ప్రచారం చేసుకున్నా వర్కవుట్ కాలేదని తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము అన్నారు. శుక్రవారం గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళ సముదాయం దగ్గర ఏర్పాటు చేసిన దివంగత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గుడివాడ వచ్చారని తెలిపారు. విగ్రహావిష్కరణ అనంతరం పనిలో పనిగా టిడ్కో ఇళ్ళను పరిశీలన చేశారంటున్నారని, ఇంకోవైపు ప్రారంభోత్సవం అని కూడా చెబుతున్నారన్నారు. రేపటి నుండి టిడ్కో ఇళ్ళల్లో నివాసముంటున్నారో లేదో తెలీదన్నారు. దీనిపై ఏ మాత్రం స్పష్టత లేకుండా కార్యక్రమం అయితే ఏదో విధంగా జరిగిందన్నారు. ఇదంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా మారిపోయిందన్నారు. టిడ్కో ఇళ్ళు కట్టడం ప్రారంభించడం దగ్గర నుండి ఇటుకలు పేర్చడం, ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేయడం, వాటికి రంగులు వేయడం వరకు ప్రజలు అన్నీ చూస్తూనే ఉన్నారన్నారు. గుడివాడలో జరిగే విషయాలను ఇక్కడి ప్రజలకు చెప్పి ఏదో విధంగా అబద్దపు ప్రచారం చేసుకోవడాన్ని కూడా గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎంత ప్రచారం చేసుకున్నా, స్కూల్ బస్సుల్లో జనాలను తరలించి ఇదంతా మేమే చేశామని ప్లానింగ్ చేసినా అది వర్కవుట్ కాలేదన్నారు. ప్రజలైతే ఇలా చెప్పినవన్నీ ఏ మాత్రం నమ్మలేదన్నారు. ఇదిలా ఉండగా ఇళ్ళు ఇస్తామని డబ్బులు కట్టించుకుని కొంత మందిని మోసం చేశారన్నారు. అలా మోసపోయిన వారిలో కొందరు తమ ఆక్రోశాన్ని, బాధను వ్యక్తం చేసే ప్రయత్నమైతే జరిగిందన్నారు. అటువంటి వారందరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి హడావుడి చేస్తున్నారన్నారు. దళిత మహిళ అసిలేటి నిర్మల, టీడీపీ మహిళా నాయకురాలు సిరిపురపు తులసీరాణితో పాటు పలువురు జనసేన పార్టీకి చెందిన వారిని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారన్నారు. పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతం దారుణంగా ఉన్న పరిస్థితులను చూస్తూనే ఉన్నామన్నారు. తామైతే ఏదో విధంగా లబ్ధిదారులకు ఇళ్ళు వస్తున్నాయని ఆనందంతో ఉన్నామన్నారు. ఇళ్ళ పంపిణీని ఏ మాత్రం వ్యతిరేకించలేదన్నారు. అయితే సమస్యలు చెప్పుకునే వారు నిరసన తెలియజేశారని, దానికి అందరినీ తీసుకువచ్చి ఇంత హడావుడి చేయడం సరికాదన్నారు. జగన్మోహనరెడ్డి కార్యక్రమాన్ని మాత్రం ఎవరూ అడ్డుకోలేదన్నారు. విసతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న జర్నలిస్ట్ లను కూడా పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంత అరాచకాలు చేయాల్సిన పనేంటని ప్రశ్నించారు. ఎవరో కట్టిన ఇళ్ళకు రంగులేసుకుని ఇవ్వడానికి కూడా ఇంత హడావుడి చేయాలా అని నిలదీశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నామని, వెంటనే వారందరినీ విడుదల చేయాలని వెనిగండ్ల డిమాండ్ చేశారు.

Comments