ఈ సంవత్సరం విద్యుత్ భద్రతా నినాదం... విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడవద్దు... తెలివిగా ఉండండి.



ఈ సంవత్సరం విద్యుత్ భద్రతా నినాదం... విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడవద్దు...  తెలివిగా ఉండండి



విద్యుత్ భద్రతా ప్రమాణాలు పెంచడం, మరియు విద్యుత్ ప్రమాదాలపై  నివారణకు ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ వారోత్సవాలు


సి ఈ ఐ జీ డిపార్ట్మెంట్ లో  కొత్త పొజిషన్ ల ఏర్పాటు


ప్రజలకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి


తిరుపతి, జూన్ 30 (ప్రజా అమరావతి): విద్యుత్ భద్రతా ప్రమాణాలు పెంచడం, మరియు విద్యుత్ ప్రమాదాలపై  ప్రజలకు అవగాహన కల్పించడమే జాతీయ విద్యుత్ భద్రత వారోత్సవాల యొక్క ముఖ్య లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖా  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. 


శుక్రవారం ఉదయం  స్థానిక తాజ్ హోటల్ లో డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్టర్  ఎలక్ట్రికల్ సేఫ్టీ మరియు సిఈఐజి విజయ లక్ష్మి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు -2023 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాల థీమ్ గా "విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడవద్దు - తెలివిగా ఉండండి" అనే నినాదంతో  విద్యుత్ భద్రత విషయంలో రాజీ పడకుండా అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించాలని ప్రజలలో విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.   విద్యుత్ సంస్థలలో పనిచేసే సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు  విద్యుత్ పనులు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని పనిచేయాలని  అన్నారు. ప్రగతికి విద్యుత్ రంగం దిక్సూచి లాంటిదని  ఏ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ఐనా ఆ రాష్ట్ర విద్యుత్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని,  ప్రతి ఒకరికీ నాణ్యమైన విద్యుత్ అందించడంలో పవర్ యుటిలిటీస్ ను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.  మానవ జీవితాలపై విద్యుత్ ప్రమాదాల ప్రభావం అధికంగా ఉంటుందని,  భద్రతా సూత్రాలను, ప్రమాణాలను పాటించడం ద్వారా విద్యుత్ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలకు గల కారణాలపై అద్యయనం చేసి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 


ఏపి పవర్  యుటిలిటీస్ మరియు సాధారణ ప్రజల కోసం  ఎస్పిడిసిఎల్ మాజీ సిఏండి పి.గోపాల్ రెడ్డి ఆద్వరంలో విద్యుత్ భద్రతా కమిటీలు  ఏర్పాటు చేయడం జరిగిందని  విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన విద్యుత్ అందించడం ఈ కమిటీల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. గౌ.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  గారి  నేతృత్వంలో సురక్షితమైన ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా అనేక  కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతున్నదని అన్నారు. విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారం  కోసం ప్రతి సబ్ స్టేషన్ కు ఒక సలహా  కమిటీని నియమించడం జరిగిందని,   డిస్ట్రి బ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు గడప గడపకు మన ప్రభుత్వం లో విద్యుత్ శాఖకు  సంబందించిన  అర్జీలు పరిష్కరించడానికి ఈ సలహా కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం, విద్యుత్ సామర్థ్యం పెంపు ప్రధాన లక్ష్యాలుగా సిఈఐజి ఆన్ లైన్ విధానం ఫైల్ డిస్పోజల్ కు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు.  

విశాఖపట్టణం – చెన్నై కారిడార్లలో భాగంగా శ్రీకాళహస్తి, తిరుపతి , ఏర్పేడు పరిసర ప్రాంతాలతో పాటు చిత్తూరు సౌత్ క్లస్టర్ లలో పెద్ద ఎత్తున్న పరిశ్రమలు రానున్నాయని, విశాఖపట్టణం – చెన్నై కారిడార్లలో కొప్పర్తి లో వై.ఎస్.ఆర్ జగనన్న హెవీ ఇండస్ట్రియల్ హబ్ వల్ల ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరగనున్నదని తెలిపారు.  పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించడం  సిఈఐజి  డిపార్ట్మెంట్ లో  కొత్త పొజిషన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని,  కాంట్రాక్ట్ లైసెన్సులు, సూపర్ వైజర్, వైర్ మాన్లు  అనుమతుల కోసం తిరుపతి, రాజమహేంద్రవరంలో రీజినల్ ఎలక్ట్రికల్  ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నామని అన్నారు. లైసెన్సింగ్ విధానం,  క్రమబద్దీకరణ కు వినియోగదారుల ప్రత్యేక అవసరాలు తీర్చడం కోసం ఈ చర్య ఎంతో దోహద పడుతుందని అన్నారు. సూపర్వైజర్, వైర్ మాన్లు అనుమతుల జారీ, రెన్యూవల్ కోసం ఫస్ట్ ఏయిడ్ అండ్ పవర్ మెడిసిన్ సర్టిఫికేట్ లను  ప్రస్తుతం హైదరాబాదులో  తీసుకోవడం జరుగుతున్నదని ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఈ విధానం రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ లోని వైద్య  కళాశాలలో నుంచి ఈ సెర్టిఫికేట్ లను మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నామని అన్నారు.   అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా  నాణ్యతమైన విద్యుత్ అందించడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉందని  దీనితో వినియోగదారులందరూ సుసంపన్నంగా, సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు.  ప్రజలు విద్యుత్ పరికరాలు వాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రత ప్రమాణాలు పాటించాలని ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 


అనంతరం కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్ మరియు సేఫ్టీ అండ్ ఎలక్ట్రిక్ సప్లై రెగ్యులేషన్స్ 2023 సంబంధిత కొత్త నియమ నిబంధనల పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. గతంలో ఉన్న రెగ్యులేషన్స్ స్థానంలో ఈ కొత్త నియమ నిబంధనలు అమలు అవుతాయని తెలిపారు.


అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు పగటి పూట 9 గంటలు నాణ్యమైన  ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా  263.37 మిలియన్ యూనిట్లు జూన్ లో కూడా డిమాండ్ కు తగ్గట్టు ఇవ్వగలిగామని అన్నారు.  


ఈ కార్యక్రమంలో  ఏపిఎస్పిడిసిఎల్ సి.ఎం.డి సంతోష రావు, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్స్ సుబ్బరాజు, ఏపీఎస్పీడీసీఎల్ ఉమెన్ డైరెక్టర్ శశి కళా, శివప్రసాద్ రెడ్డి, ఏపీఎస్పీడిసీఎల్  ఎస్ఈ, తిరుపతి కృష్ణా రెడ్డి,ఎస్వీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ డా. చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.



Comments