స్పందన అర్జీలు సకాలంలో పరిష్కరించాలి.

 


 రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


. స్పందన అర్జీలు సకాలంలో పరిష్కరించాలి. ప‌రిష్క‌రిస్తున్న తీరుపై మండ‌ల ప్ర‌త్యేకాధికారులు ప‌ర్య‌వేక్ష‌ణ చేయాలి


అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా అర్జీలు నాణ్యతో కూడిన విధంగా పరిష్కరించాలి.


నేడు స్పందనలో వచ్చిన అర్జీలు సంఖ్య... 105


..కలెక్టరు డా. కే. మాధవీలత

 

ప్రజా సమస్యలు పరిష్కార వేధిక స్పందనల వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత  అధికారులను ఆదేశించారు.


సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టరు మాధవీలత జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డీఆర్వో జె. నరశింహులతో కలసి  స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టరు డా. కే. మాధవీలత మాట్లాడుతూ స్పందనలో నేడు 105 అర్జీలు స్వీకరించామని ఇందులో ఆన్ లైన్ ద్వారా 88, ఆఫ్ లైన్ ద్వారా17 ఉన్నాయన్నారు. అర్జీలు ప‌రిష్కారంలో భాగంగా క్షేత్ర‌స్థాయి ఆయా గ్రామాలు, వార్డుల్లో విచార‌ణ‌కు వెళ్లేట‌పుడు పిటిష‌న్ దారుల‌కు సంబంధిత స‌మాచారం ఇవ్వాల‌న్నారు.

Comments