రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.

 *- రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి*


 *- వైసిపి నాలుగేళ్ల పాలనలో ఉద్యోగాలు లేవు*

 *- మద్యం ధరలు పెంచి నాసిరకం బ్రాండ్లు తెచ్చారు*

 *- భావితరాల భవిష్యత్తు కోసమే చంద్రబాబు పోరాటం*

 *- పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రణాళికలు*

 *- పేదల పక్షాన నిలిచేలా కార్యక్రమాలు చేపడతాం*

 *- జనార్ధనపురంలో గ్రామస్తులనుద్దేశించి మాట్లాడిన వెనిగండ్ల*గుడివాడ, జూన్ 8 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని నందివాడ మండలం జనార్దనపురం గ్రామంలో టిడిపి మినీ మేనిఫెస్టోపై గ్రామస్తులకు వెనిగండ్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెనిగండ్ల గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిందని, జగన్ రెడ్డి పాలనలో ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలను విపరీతంగా పెంచేసారని గుర్తు చేశారు. మరోవైపు నాసిరకం మద్యం బ్రాండ్లను విక్రయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. పేదలను సంపన్నులుగా చేయడమే చంద్రబాబు లక్ష్యమని  తెలిపారు. దీనిలో భాగంగానే మినీ మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ అనే పథకాన్ని చంద్రబాబు ప్రవేశ పెట్టారని చెప్పారు. ఈ పథకంతో పేదలను సంపన్నులను చేసే విధంగా టిడిపి ముందుకు వెళుతుందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా భవిష్యత్తు ప్రణాళికలను చంద్రబాబు సిద్ధం చేశారని స్పష్టం చేశారు. మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా యువత, మహిళలు, రైతులను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. పేదల పక్షాన నిలిచేలా మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. సంపద సృష్టించడం నేర్పింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. టిడిపిని దెబ్బతీసేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని చెప్పారు.

వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని, చంద్రబాబును ప్రజలంతా ఆశీర్వదించాలని వెనిగండ్ల విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనార్దనపురం గ్రామ ప్రముఖులు మలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గూడపాటి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా చంటి, అరికేపూడి రామశాస్త్రిలు, రాధాకృష్ణ, ఏసు పాదం, సిరిపురపు తులసీరాణి, బొంబాయి శ్రీను, లింగం చిట్టిబాబు, మేరుగు మోజెస్, గడ్డం ప్రకాష్ దాస్, సుబ్బారావు, రవి తదితరులు పాల్గొన్నారు.

Comments