మానవత్వం చాటుకున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

 

*మానవత్వం చాటుకున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్**నంద్యాల చెక్ పోస్ట్ లో అదుపుతప్పి కిందపడిన మహిళకు కాన్వాయ్ ఆపి సాయం*


కర్నూలు జిల్లా, జూన్, 27 (ప్రజా అమరావతి); రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మానవత్వం చాటుకున్నారు. కర్నూలు పట్టణంలోని నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తూ స్పీడ్ బ్రేకర్  దగ్గర అదుపుతప్పి పడిపోయిన ఓ మహిళకు తన కాన్వాయ్ ని ఆపి సహాయక చర్యలు చేపట్టారు. ముక్కు దగ్గర గాయమై రక్తం కారుతున్న మహిళకు ధైర్యం చెబుతూ  అటు వైపు వస్తున్న వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాన్ని ఆపి సమీపంలోని ఆస్పత్రికి క్షతగాత్రురాలిని తరలించే సహాయక ఏర్పాట్లను మంత్రి బుగ్గన స్వయంగా చేశారు. ఆమె చికిత్స ఏర్పాట్లను పర్యవేక్షించవలసిందిగా తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. కర్నూలు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కలెక్టర్ తో సమీక్ష అనంతరం మంత్రి బుగ్గన నంద్యాలకు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు అధికారులను మంత్రి బుగ్గన అభినందించారు. Comments