గుడివాడ, జూన్ 16 (ప్రజా అమరావతి);
*టిడ్కో గృహాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి
*
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడలో టి డ్కో గృహాలు ప్రారంభించారు.
శుక్రవారం గుడివాడ విచ్చేసిన ముఖ్యమంత్రి టిడ్కో గృహా సముదాయాల వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ చేరుకున్నారు. గుడివాడ మల్లయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో గృహాలను ప్రారంభించి, ఇవే గృహ సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సభా స్థలికి విచ్చేసిన ముఖ్యమంత్రి జల జీవన్ మిషన్ క్రింద కృష్ణాజిల్లా తీర ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు 750 కోట్ల రూపాయల వ్యయంతో పైపులైన్ల నిర్మాణం, అందులో గుడివాడ, నందివాడ మండలాల్లో 160 కోట్ల రూపాయల వ్యయంతో పైప్లైన్ల నిర్మాణానికి, 26 కోట్లతో గుడివాడ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం టిడ్కో గృహాల లబ్దిదారులతో ఫోటో దిగారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు మంజూరు చేస్తూ వరాల జల్లు కురిపించారు.
అనంతరం టిడ్కో లబ్ధిదారులకు సభా వేదికపై టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ పత్రాలు ముఖ్యమంత్రి అందజేశారు.
రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పట్టణ పేద ప్రజలకు రూపాయికే అన్ని హంగులతో సొంతిల్లు అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న పేదల పాలిట ఆపద్బాంధవుడని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల టిట్కో ఇళ్లు నిర్మాణాలు ఈ సంవత్సరం ఆఖరి నాటికి పూర్తి చేయనున్నామని తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించిన టిడ్కో కాలనీ రాష్ట్రంలో అతి పెద్ద టిట్కో కాలనీగా, మినీ గుడివాడగా రూపాంతరం చెందగలదని, 51 వేల కుటుంబాలలో చిరునవ్వులు చిందించిన ముఖ్యమంత్రి జగనన్న పేదింటి కలను సాకారం చేశారని అన్నారు.
జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ సొంతిల్లు కలిగి ఉండాలనే ప్రతి ఒక్కరి కల సాకారం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు పీఎంఏవై- వైయస్సార్ జగనన్న నగర్ ను ప్రారంభించారని అన్నారు. 77.46 ఎకరాల్లో 800 కోట్లతో 8912 టిట్కో గృహాలను నిర్మించి, గృహ సముదాయాల్లో అన్ని వసతులు కల్పించి పేద ప్రజలు గౌరవంగా జీవించే అవకాశం కల్పించినందుకు లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. టిట్కో గృహ సముదాయాల ప్రక్కనే నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద 178 ఎకరాల్లో 7,728 గృహాలతో వైయస్సార్ జగనన్న కాలనీ రూపు దిద్దుకోవడం జరుగుతోందన్నారు. వీటితో కలిపి సుమారు 16,640 గృహాలు ఒకే చోట అతిపెద్ద గృహ సముదాయం ఏర్పాటు కానున్నదని తెలిపారు.
5156 కోట్ల రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన మచిలీపట్నం పోర్టు పనులు, 422 కోట్ల రూపాయలతో ఆధునిక ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నయన్నారు. మచిలీపట్నంలో 550 కోట్ల రూపాయల వ్యయంతో 64 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మాణాలు పూర్తి కావచ్చాయని, ఆగస్టులో 150 మందికి వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి సంకల్పించిన ఈ ప్రాజెక్టులన్ని సకాలంలో పూర్తి చేసే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.
గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని మాట్లాడుతూ ఈరోజు 800 కోట్ల వ్యయంతో 8912 టిడ్కో గృహా సముదాయంలో పక్కా సీసీ రోడ్లు, విద్యుత్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్ టి పి ట్యాంక్, 40 లక్షల లీటర్ల ప్యూరిఫైడ్ వాటర్ తదితర సదుపాయాలతో ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్నారని తెలిపారు. టిడ్కో కాలనీ కోసం స్వర్గీయ వైయస్సార్ 77 ఎకరాలు కొనుగోలు చేసి ఇచ్చిన విషయం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేస్తారు. అంతేకాకుండా స్వర్గీయ వైయస్సార్ 106 ఎకరాల భూమి కొనుగోలు చేసి 20 కోట్లు వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పంప్ హౌస్ నిర్మించి గుడివాడ ప్రజల దాహార్తి తీర్చిన మహానుభావుడని కొనియాడారు. గుడివాడలో 320 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయన్నారు నియోజకవర్గ పరిధిలో 1500 కోట్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం. విక్టర్ ప్రసాద్, రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీ లక్ష్మి, పురపాలక శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ పి కోటేశ్వరరావు, కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, ఏపీ టెట్కో చైర్మన్ జమ్మన ప్రసన్నకుమార్, రాష్ట్ర ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ తిప్పలమల్లి జమల పూర్ణమ్మ, పార్లమెంటు సభ్యులు ఆళ్ళ అయోధ్య రామయ్య, శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, టి.కల్పలత, తలసీల రఘురాం, పోతుల సునీత, శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కైలే అనిల్ కుమార్, దూలం నాగేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్, సింహాద్రి రమేష్ బాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ , డిఆర్వో ఎం వెంకటేశ్వర్లు టిడ్కో ప్రాజెక్ట్ అధికారి చిన్నోడు, ఆర్డీవో పద్మావతి, గుడివాడ మున్సిపల్ కమిషనర్ వి మురళీకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, రాష్ట్ర ఉన్నత అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment