టీడీపీ మేనిఫెస్టో ఉద్ధేశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న వెనిగండ్ల.

 *- టీడీపీ మేనిఫెస్టో ఉద్ధేశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న వెనిగండ్ల


 *- గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున అవగాహన* 

 *- క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపైనా అధ్యయనం* 

 *- చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రణాళిక* 

 *- మేనిఫెస్టోతో ప్రజలకు మరింత చేరువవుతున్న వెనిగండ్ల* 

 *- టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు  బాధ్యతాయుతంగా పనిచేస్తా* 

 *- తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము*



గుడివాడ, జూన్ 23 (ప్రజా అమరావతి): రాజమహేంద్రవరం మహానాడు వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ఉద్దేశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఆ పార్టీ నేత వెనిగండ్ల రాము తీవ్రంగా కృషి చేస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని నందివాడ మండలం జనార్ధనపురం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీపై ఇప్పటికే టీడీపీ శ్రేణులతో కలిసి వెనిగండ్ల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పెద్దఎత్తున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ ప్రజాసమస్యలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పేరుతో ప్రజల్లోకి వెళ్ళిన వెనిగండ్లకు అన్నివర్గాల ప్రజల నుండి అనూహ్య మద్దతు ఎదురైంది. తాజాగా భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలపై గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల ప్రచారం చేస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా సమర్ధవంతంగా ఎండగడుతూ వస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అమలు చేయబోయే కార్యక్రమాలకు సంబంధించిన మేనిఫెస్టోకు మరింత ప్రాచుర్యం లభించేలా వెనిగండ్ల కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా వెనిగండ్ల మాత్రం 2024 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు  బాధ్యతాయుతంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని చెప్పారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రల ద్వారా మినీ మేనిఫెస్టోపై పార్టీ నేతలంతా ప్రచారం నిర్వహిస్తారన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేనిఫెస్టో ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించడం జరుగుతుందన్నారు. ప్రజల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా చంద్రబాబు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. మహాశక్తి పేరుతో మహిళలకు చంద్రబాబు ప్రత్యేక పథకాలను ప్రకటించారని చెప్పారు. ప్రతి కుటుంబంలో 18ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు రూ. 1500లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని వెనిగండ్ల చెప్పుకొచ్చారు.

Comments