రైతులకు భరోసా " వై ఎస్ ఆర్ రైతు భరోసా-పి ఎం కిసాన్ పధకం" జిల్లా స్థాయి కార్యక్రమం.

 *చిత్తూరు జిల్లా* 


 చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం. (ప్రజా అమరావతి); రైతులకు భరోసా " వై ఎస్ ఆర్ రైతు భరోసా-పి ఎం కిసాన్ పధకం" జిల్లా స్థాయి కార్యక్రమం.
 వరుసగా 5 వ ఏడాది ..2023-24 సం.మొదటి విడత కార్యక్రమం .


 జిల్లాలో2023-24 సం. మొదటి విడతగా2,27,010 రైతు కుటుంబాల కు రూ. 170.84 కోట్లు... (వైయస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ రూ.7,500/- మంజూరు చేయడమైనది).


 గురువారం ఉదయం గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూల్ జిల్లా పత్తి కొండ నుండి వై ఎస్ ఆర్ రైతు భరోసా-పి ఎం కిసాన్ పధకం  కార్యక్రమం ను లాంఛనంగా ప్రారంభించగా..ఈ కార్యక్రమంను   వర్చువల్ విధానం లో వీక్షిస్తున్న  రాష్ట్ర అటవీ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖమంత్రి, జిల్లా కలెక్టర్,జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్,సంబంధింత అధికారులు,    రైతులు..ఈ కార్యక్రమము నకు ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర అటవీ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి డా.పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి,జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్,జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు,చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామ చంద్రా రెడ్డి, రాష్ట్రమొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్,ఐ సి డి ఎస్ రాయల  సీమ జోనల్ చైర్మన్ శైలజా రెడ్డి.., వీరితో పాటు  చిత్తూరు నగర మేయర్ అముద, జిల్లా వ్యవసాయ అధికారి మురళీ కృష్ణ,జిల్లాఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డి,జడ్పీ సీ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి,జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, జడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్మన్ భారతి, చిత్తూరు ఆర్ డి ఓ రేణుకా,ప్రజా ప్రతినిధులు,  రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.Comments