సమాజ సేవా కార్యక్రమాల్లో బ్యాంకులు భాగస్వామ్యం కావడం అభినందనీయమ
మచిలీపట్నం జూన్ 1 (praja amaravati):---


సమాజ సేవా కార్యక్రమాల్లో బ్యాంకులు భాగస్వామ్యం కావడం అభినందనీయమ


ని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు.


గురువారం సాయంత్రం నగరంలోని కోర్టు రోడ్డులో గల ఐసిడిఎస్ కార్యాలయ ప్రాంగణంలో శిశు గృహ నూతన  భవనాన్ని జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, చిన్నారి తో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నడపబడుతున్న శిశు గృహాలు ఆలనా పాలనా లేని అనాధ బాలబాలికలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.  సంయుక్త కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఐ.డి.ఎఫ్.సి. ఫస్ట్ బ్యాంక్ ముందుకు వచ్చి 4 లక్షల రూపాయల వ్యయంతో శిశుగృహ నూతన భవనాన్ని పునర్ నిర్మించడం ఎంతో అభినందనీయమన్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న ఐసిడిఎస్ కార్యాలయం భవనాలను కూడా పూర్తి చేసేందుకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవసరమైన నిధులు సమకూర్చాలని కోరారు.


అంతకుమునుపు సంయుక్త కలెక్టర్  డాక్టర్ అపరాజిత సింగ్ జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ  ఐసిడిఎస్ ఆధ్వర్యంలో

మచిలీపట్నంలో శిశు గృహ 2011 మార్చి 1వ తేదీ నుండి  ఇప్పటివరకు ప్రైవేటు భవనంలోనే నడపబడుతున్నదని, ప్రస్తుతం నూతన భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 39 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారన్నారు. ప్రస్తుతం శిశు గృహలో నలుగురు చిన్నారులు ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ కారా ద్వారా సీనియార్టీ ప్రకారం దత్తత స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు వివరించారు.


ఐసిడిఎస్ కార్యాలయ ప్రాంగణంలో నూతన భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉందని వాటిని పూర్తి చేయుటకు, చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఇంకా కొంత నిధులు అవసరం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ భవనాల పూర్తికి కూడా సహకరించి నిధులు అందజేయాలని బ్యాంకు అధికారులను కోరారు.

ఐసిడిఎస్ కార్యాలయం ప్రాంగణంలో చెత్తాచెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

ఐడిఎఫ్సి బ్యాంకు రాష్ట్ర అధిపతి వలివేటి శ్రీనివాస్ స్పందిస్తూ భవనాల నిర్మాణం పూర్తికి అవసరం అయిన ప్రతిపాదనలు పంపించిన పక్షంలో నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.


అనంతరం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్, ఐడిఎఫ్సి ఫస్ట్  బ్యాంకు అధికారులను అభినందించి శాలువలు పూల మొక్కలతో ఘనంగా సత్కరించారు.


ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి స్వర్ణ,ఆర్డిఓ   ఐ. కిషోర్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రాష్ట్ర అధిపతి వలివేటి శ్రీనివాస్, జిల్లా మేనేజర్ కర్రీ సూరెడ్డి, తహసిల్దార్ సునీల్ బాబు,  డి సి పి ఓ జాన్సన్, సిడిపివోలు పద్మావతి, గ్లోరీ, న్యాయవాది శ్రీ గౌరీ, పలువురు అంగన్వాడి సూపర్వైజర్లు, కూడా కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments