వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకొనేలా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కలిగించాలి.



మచిలీపట్నం జూన్ 19 (ప్రజా అమరావతి):


వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకొనేలా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కలిగించాల


ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు.


సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో వైయస్సార్ పశు బీమా పథకం పై రూపొందించిన కరపత్రాలను, గోడపత్రాలను ఆవిష్కరించారు.



ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పశుపోషణపై ఆధారపడిన పశుపోషకులకు ఆపత్కాలంలో వైయస్సార్ బీమా పథకం పశు బీమా పథకం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. 


గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులు గొర్రెలు మేకలు, ప్రమాదవశాత్తు మరణిస్తే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.


ఈ పథకం గురించిన వివరాలను పశుపోషకులు అందరికీ అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని  కలెక్టర్ సూచించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ దివాకర్, వీడిఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

 

Comments