గుంటూరు రమేష్ హాస్పిటల్స్ నందు యోగా డే వేడుకలు .

 గుంటూరు రమేష్ హాస్పిటల్స్ నందు యోగా డే వేడుకలు   గుంటూరు (ప్రజా అమరావతి);

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంటూరు రమేష్ హాస్పిటల్స్ నందు హాస్పటల్ యొక్క సిబ్బందికి మరియు వచ్చిన పేషంట్స్ యొక్క బంధువులకు యోగ పై అవగాహన కలిగించడం జరిగింది.

ఈ సందర్భంగా రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 21 వ తారీఖున అంతర్జాతీయంగా యోగ డేని జరుపుకుంటామని, మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. నగర జీవనవిధానంలో కాలంతో పోటీ పడుతూ, ఉరుకుల పరుగుల లైఫ్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ప్రతి నిత్యం యోగాతో తమ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని, సమాజంలో కల్తీ, కలుషిత ఆహారాన్ని భుజించడంతో చిన్నతనం నుంచే వివిధ రోగాలు వ్యాపిస్తున్నాయి. షుగర్‌, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రోజురోజుకూ మానవ జీవిత కాలం తగ్గుతుందని, దీనికి గాను ప్రతి ఒక్కరూ తప్పకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అనునిత్యం యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని అన్నారు.

ప్రస్తుతం దేశమంతా చర్చించుకుంటున్న పేరు పద్మశ్రీ బాబా శివానందజి  వందేళ్లు పైబడిన వయసులోనూ పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆయన ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఆయనే మనకు నిదర్శనం అని అందరికీ వివరించారు.

ఈ కార్యక్రమంలో రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత పలువురు పాల్గొన్నారు.

Comments