క్షేత్ర స్థాయిలో పటిష్టంగా అమలు జరిగేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి.

 

నెల్లూరు (ప్రజా అమరావతి);

గ్రామీణ ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ, అభివృద్ధి  కార్యక్రమాలను  క్షేత్ర స్థాయిలో   పటిష్టంగా అమలు జరిగేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో  పనిచేయాల


ని జిల్లా  పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పేర్కొన్నారు.


సోమవారం జడ్.పి. సమావేశ మందిరంలో  జడ్పీ  చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ అధ్యక్షతన గ్రామీణాభివృద్ది విషయాలు, వ్యవసాయ విషయాలు, విద్య, వైద్య , స్త్రీ సంక్షేమ విషయాలు,  సాంఘిక సంక్షేమ విషయాలు, ప్రణాళికా మరియు ఆర్ధిక విషయలు,   పనుల విషయాలు, తదితర విషయాలపై  స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి.  ఈ స్థాయీ సంఘాల సమావేశాల్లో   ఆయా శాఖల ద్వారా ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది  కార్యక్రమాల వివరాలను వివరించడంతో పాటు  ఆయా కార్యక్రమాల  పనుల పురోగతిని  సంబందిత   శాఖల అధికారులు, జడ్పీ  చైర్ పర్సన్ గారికి, ఆయా  స్థాయీ సంఘాల్లో సభ్యులుగా వున్న జడ్.పి.టి.సి సభ్యులకు తెలియచేయడం  జరిగింది. ఈ సంధర్భంగా క్షేత్ర స్థాయిలో వున్న పలు సమస్యలను  స్థాయి సంఘాల సభ్యులు జడ్పి  చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడం జరిగింది.  జడ్పి  చైర్ పర్సన్ స్పందిస్తూ  సభ్యులు సమావేశంలో  తెలిపిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల వివరాలను  సంబందింత జడ్పిటిసి సభ్యులకు,  ఇతర ప్రజా ప్రతినిధులకు కచ్చితంగా తెలియచేయాలని ఆమె, అధికారులను ఆదేశించారు.


తొలుత గ్రామీణాభివృద్ది  విషయాలపై జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో  జిల్లా నీటి యాజ్యమాన్య సంస్థ అధ్వర్యంలో  జరుగుచున్న  అభివృద్ది కార్యక్రమాలను ఆ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్  వివరిస్తూ,  గ్రామీణ ప్రాంతాల్లోని పనులు చేయడానికి వచ్చే నైపుణ్యం లేని కూలీ కుటుంబానికి ఏడాదిలో కనీసం 100 పని దినాలు కల్పించడమే  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ముఖ్య ఉద్దేశ్యమని,  గత ఆర్ధిక సంవత్సరంలో  రోజు వారి కూలీ సగటు రేటు రూ.257/- లు వుండగా, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.272/- వరకు పెంచడం జరిగిందని,వేతనదారులు చేసిన పనిని బట్టి కూలీ ఇవ్వడం జరుగుతుందని  తెలిపారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 106.56 లక్షల పని దినాలు లక్ష్యంగా నిర్దారించగా, 1,13,14,677 మపని దినములు పూర్తీ చేసి, వేతనం కింద 231.36 కోట్ల రూపాయలు,  సామాగ్రి క్రింద 180.96   కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి గ్రామీణాభివృద్ది విషయాలపై  జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో విద్యుత్, సెట్నల్, నెడ్ క్యాప్ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులు వివరించారు.


అనంతరం  వ్యవసాయ విషయాలపై జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో   పశు సంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆ శాఖ  అధికారులు వివరిస్తూ,   జిల్లాలో 170 క్షేత్ర స్థాయి పశు వైద్య సంస్థల ద్వారా పశు వైద్యం అందచేయడం జరుగుచున్నదని, అలాగే, ఆర్బికె ల ద్వారా  పశు వైద్య సేవలను అందించడంతో పాటు  పశువులకు, గొర్రెలు, మేకలకు  సంబంధించి  డి వార్మింగ్ ప్రోగ్రాం, వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పటిష్టంగా చేపడుతున్నట్లు  సభ్యులకు తెలియచేయడం జరిగింది.  ఈ సంధర్భంగా మత్స్య  శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సంబంధిత జాయింట్ డైరెక్టర్, జడ్పి చైర్ పర్సన్ వారికి, సంబందిత కమీటీల జడ్పిటిసి సభ్యులకు వివరించారు. 


తదుపరి  జరిగిన  స్థాయీ సంఘ సమావేశంలో విద్య, వైద్య సేవలపై  కమిటీ చర్చిండం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుచున్నదని,  విద్య శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను ఆ శాఖ  అధికారులు వివరిస్తూ, జిల్లాలోని రెండో విడత  మన బడి నాడు – నేడు కింద రూపాయలతో సంబందిత పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని  వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో  జగనన్న గోరుముద్ద పధకం కింద పౌష్ఠికాహారం అందచేయడం, 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 2,13,257 మంది విద్యార్దులకు  జగనన్న విద్యా కానుక కిట్స్  పంపిణీ చేయడం జరుగుచున్నదని తెలిపారు.  జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి  వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు.  తదుపరి స్త్రీ సంక్షేమ విషయాలు,  సాంఘిక సంక్షేమ విషయాలపై  జరిగిన    స్థాయీ సంఘ సమావేశాలల్లో  సంబందిత శాఖల అధికారులు క్షుణ్ణంగా ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పనులు, వాటి పురోగతిపై  జడ్.పి. చైర్ పర్సన్ వారికి, సంబందిత కమీటీల జడ్.పి.టి.సి సభ్యులకు వివరించారు.


గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆయా గ్రామాల్లోనే సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలను, విలేజి హెల్త్ క్లినిక్ లను, రైతు భరోసా కేంద్రాలను, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ లను, బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను మంజూరు చేసి నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలుపుతూ, వాటి నిర్మాణాల పురోగతిని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా వివిధ పధకాల కింద చేపట్టిన పనుల వివరాలను జడ్.పి. చైర్ పర్సన్ వారికి, సంబందిత కమీటీల జడ్.పి.టి.సి సభ్యులకు వివరించారు.

 

ఈ  స్థాయీ సంఘ సమావేశాల్లో  శాసన మండలి సభ్యులు  పర్వతరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి,  జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయ లక్ష్మమ్మ, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ చిరంజీవి,  డ్వామా పి.డి. వెంకటరావు, హౌసింగ్ పీడీ నరసింహం, మత్స్య శాఖ జె.డి  నాగేశ్వర రావు, జిల్లా ఉద్యాన శాఖాధికారి  సుబ్బారెడ్డి,  పరిశ్రమల కేంద్రం డిడి షఫీ అహ్మద్, సెట్నల్ సీఈఓ  పుల్లయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, డి.సి.హెచ్.ఎస్ డా. రమేష్ నాథ్ ,  డిడి సోషల్ వెల్ఫేర్ అధికారి  కె. రమేష్, ఐటిడిఏ పి.ఓ రాణి మందా, ఐసిడి.ఎస్. పిడి సౌజన్య, జిల్లా బి.సి.వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, పంచాయతీ రాజ్ శాఖ  ఎస్ ఈ అశోక్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్  ఎస్.ఈ  రంగ వర ప్రసాద్,  సంబంధిత శాఖల అధికారులు, స్థాయీ సంఘాల్లో సభ్యులుగా వున్న జడ్పిటిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


Comments