ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, క్రికెటర్‌ అంబటి రాయుడు.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మేనేజ్‌మెంట్, క్రికెటర్‌ అంబటి రాయుడు.సీఎస్‌కే టీంను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌.


ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వివరించిన అంబటి రాయుడు, వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం హామీ.


ఇటీవల ఐపీఎల్‌ ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్, ట్రోఫీని ముఖ్యమంత్రికి చూపిన సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్, అంబటి రాయుడు.


సీఎస్‌కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి బహుకరించిన రూపా గురునాథ్, అంబటి రాయుడు.

Comments