పూణెలో ‘ఏపీ స్టాల్’ను సందర్శించిన కేంద్రవిద్యాశాఖామంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్.

అమరావతి (ప్రజా అమరావతి);


*పూణెలో ‘ఏపీ స్టాల్’ను సందర్శించిన కేంద్రవిద్యాశాఖామంత్రివర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


*


* బైలింగువల్ పుస్తకాలను మెచ్చుకున్న మంత్రి.జి-20లో భాగంగా పూణెలో జరుగుతున్న ‘జన్ భాగిదారీ’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏర్పాటు చేసిన ‘ఫౌండేషనల్’ స్కూల్ నమూనా బుధవారం కేంద్ర విద్యాశాఖామంత్రి  ధర్మేంద్ర ప్రధాన్  సందర్శించారు. 

నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన మాతృ భాషాధారిత బహుభాష (సవర, కొండ, కువి, ఆదివాసీ ఒడియా, కోయ, సుగాలి), బైలింగువల్ పాఠ్య పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించి, ఇలాంటి పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.    

కేంద్ర ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖ సలహాదారు డా. రామచంద్ర , పశ్చిమ బంగా ఎస్సీఈఆర్టీ ప్రతినిధులు, మహారాష్ట్ర డైట్ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునాది విద్యకు అవలంభిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. 


Comments