సింగపూర్ యూనివర్శిటీతో కలిసి బయోసెన్సార్ ల పై కెఎల్ యు ఉమ్మడి పరిశోధనకు కసరత్తు.

 *సింగపూర్ యూనివర్శిటీతో కలిసి బయోసెన్సార్ ల పై కెఎల్ యు ఉమ్మడి పరిశోధనకు కసరత్తు.*



అమరావతి (ప్రజా అమరావతి);

సింగపూర్ కు చెంది న నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీతో కలిసి కెఎల్ యు స్పేస్ సైన్స్ తో పాటు బయో సెన్సార్ లపైన లోతైన పరిశోధనను చేయడానికి రంగం సిద్దం చేసినట్లు కె.ఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు అన్నారు. మంగళవారం నాడు వడ్డేశ్వరంలోని విశ్వవిద్యాలయంలోని విసి చాంబర్ లో సింగపూర్ కు చెందిన నాన్యాంగ్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం ప్రతినిధితో సమావేశమయి పలు కీలక అంశాలపైన చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కనీసం 25 మంది విద్యార్థులు వేరు వేరు అధ్యాపకుల ద్వారా 6 నెలల పాటు పరిశోధనలు చేయడం కోసం పరస్పరం సహకరించుకోవడం జరగుతుందన్నారు. మరిన్ని పరస్పర సహకార చర్యల ద్వారా కొనసాగుతున్న 2 ప్రాజెక్టులను (స్పేస్ సైన్స్, బయో సెన్సార్లు) వంటి ప్రాజెక్టులను బలోపేతం చేయడం కోసం  ఉమ్మడిగా పిహెచ్.డి విద్యార్థులను సంయుక్తంగా కలిగి ఉండటంతో పాటు బయో సెన్సార్ ల పైన పరిశోధనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. పరస్పర సహకారంతో విశ్వవిద్యాలయాలలో చదువుతున్న విద్యార్ధులకు మరింత మెరుగైన అవకాశాలను అందించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా కె.ఎల్.విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని సందర్శించిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (ఎన్.టి.యు-సింగపూర్) అధ్యాపకులు డాక్టర్ రోడరిక్ బాట్స్ మాట్లాడుతూ కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీతో కలిసి పనిచేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కె.ఎల్.యులో ఎం.బి.ఎ ఎంచుకున్న విద్యార్థులు ఎన్.టి.యులో కూడా ఒక సెమిస్టర్ లేదా ఒక సంవత్సరం పాటు విద్యను అభ్యసించవచ్చునని అన్నారు. ఎన్టీయు (సిగపూర్) అధ్యాపకులు కె.ఎల్.యు విద్యార్థులకు వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్ ద్వారా కూడా బోధించడంతో పాటు హైదరాబాదు,విజయవాడలోని కెఎల్.యు ఎంబిఎ కళాశాలలో బలమైన పరిశోధన ప్రాజెక్టులను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతోపాటు, అధిక నాణ్యత గల ప్రచురణలను ప్రచురించడం కోసం కృషి చేస్తామని దీమా వ్యక్తం చేశారు. 

కెఎల్ యు ప్రో చాన్సులర్ డాక్టర్ కెఎస్.జగన్నాథరావు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు  విజ్ఞానాన్ని సులభతరం చేయడానికి ఏటా హైదరాబాద్, విజయవాడలతో పాటు సింగపూర్ లో కూడా ఉమ్మడి సమావేశాలు, వర్క్ షాప్లు లేదా పరిశ్రమల పరస్పర కాలపరిమితులను ఏర్పాటు చేసుకోవడం వంటివి తాము గతంలో చేసుకున్న ఒప్పందంలో ఉన్నట్లు తెలిపారు. విదేశాలలో ఉండి ఆన్ లైన్ కోర్సులు చేస్తున్న వారికి ఇది సదవకాసంగా తెలిపారు. 45 రోజుల ఇంటర్నషిప్ ల తో పాటు ఉమ్మడి పరిశోధనలు, ఆవిష్కరణల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్.విశ్వవిద్యాలయం ప్రో చాన్సులర్ డాక్టర్ కెఎస్.జగన్నాథరావు, వైస్.చాన్సలర్ డాక్టర్.జి.పార్ధసారధి వర్మ,  ప్రొ.వైస్ చాన్సలర్ డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, రిజిస్ర్టార్ డాక్టర్ కె.సుబ్బారవు, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ అధ్యాపకులు డాక్టర్ రోడరిక్ బాట్స్ , అంతర్జాతీయ సంభందాల డైరెక్టర్ డాక్టర్ ఎం.కిషోర్ బాబు, లైఫ్ స్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.బుచ్చినాయుడు, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, డీన్ సలహాదారులు డాక్టర్ కెఆర్.ఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments