శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):

            దేవస్థానం నందు రానున్న ఆషాడ మాసం మరియు శాకాంబరీ దేవి ఉత్సవములు పురస్కరించుకొని ఈరోజు మహామండపం 6 వ అంతస్తు నందు మీడియా మిత్రుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు , ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ , ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్దా రాంబాబు, కట్టా సత్తయ్య, బచ్చు మాధవీ కృష్ణ , ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు కే.వి.ఎస్ కోటేశ్వర రావు , స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ  మరియు వైదిక సిబ్బంది lvs బద్రీనాధ్ బాబు, UVS మురళీధర శాస్త్రి, మార్తీ యజ్ఞనారాయణ శర్మ, రఘునాథ్ శర్మ   పాల్గొన్నారు.


  సమావేశం నందు చైర్మన్ గారు మాట్లాడుతూ ఆషాడ మాసంలో దేవస్థానం నందు జూలై 1 నుంచి 3 వరకు శాకంబరీ దేవి ఉత్సవములు నిర్వహించుటకు ఆలయ వైదిక కమిటీ వారు సూచించారని, గతంలో శాకంబరి దేవి ఉత్సవములను  రైతులు, వ్యాపారులు మరియు అందరూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు  సమర్పించి శాకంబరీ దేవి ఉత్సవముల నందు పాలుపంచుకుని దిగ్విజయం చేయడం జరిగిందన్నారు. ఈ పాలకమండలి ఏర్పాటు తర్వాత జరుగుచున్న మొదటి శాఖాంబరి ఉత్సవములని, ఈ ఏడాది కూడా ప్రజలు అందరూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు దేవస్థానం నందు సమర్పించి రసీదు పొంది 

శాకంబరీ దేవి ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించుటలో పాలు పంచుకొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అదేవిధంగా ఆషాడ మాసం సందర్భంగా జగజ్జనని అమ్మవారికి పవిత్ర సారే సమర్పించు వారందరూ ముందుగా దేవస్థానం టోల్ ఫ్రీ నెంబర్, లేదా ఫెస్టివల్ విభాగం నందు సమాచారం ఇవ్వాలని కోరి, ఆషాడ మాసం సందర్భంగా పెద్ద ఎత్తున సారె సమర్పించు భక్తుల కొరకు దేవస్థానం వారు ఏర్పాట్లు చేయగలరని చేయనున్నట్లు తెలిపారు. ఆలయం నందు సేవా కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధికి ఆలయ కార్యనిర్వహణాధికారి, వైదిక కమిటీ మరియు అధికారుల సూచనల మేరకు భక్తులకు సేవా కార్యక్రమాలు చేరువ చేయుటకు కృషి చేస్తామని, వర్షాలు సమృద్ధిగా పడి, పాడిపంటలతో రాష్ట్రం మరియు రైతులు సుభిక్షంగా ఉండాలని నిర్వహించు శాకంబరీ దేవి ఉత్సవములలో అందరూ పాలుపంచుకొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరారు.అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ దేవస్థానం నందు జూన్ 19 నుండి ఆషాడ మాస సంబరాలు ప్రారంభమవుతాయని, ప్రతి సంవత్సరం లాగా ఆలయ వైదిక కమిటీ సభ్యులు మొదటిసారె ను  అమ్మవారికి  సమర్పిస్తారని, తదుపరి భక్తులు పలు బృందాలుగా తరలివచ్చి పెద్ద సంఖ్యలో ఆషాడ మాసంలో అమ్మవారికి సారే సమర్పించుకొనడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ సుభక్షంగా ఉండాలని జులై 1 నుండి 3 వరకు దేవస్థానం నందు శాకంబరీ దేవి ఉత్సవములు జరగనున్నాయని, భక్తులు మరియు దాతలు ముందుకొచ్చి వారి వంతు విరాళములను అందజేసి, రసీదు పొంది శాకంబరీ ఉత్సవంలలో పాలుపంచుకొని అమ్మవారి స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. మరియు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల కమిటీ వారు గత సంవత్సరంల వలే ఈ ఏడాది కూడా జులై 2న బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి నుండి ఊరేగింపుగా బయలుదేరి సుమారు 5000 మంది తో ఆలయం కు చేరుకొని అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లుగా కార్యనిర్వహణ అధికారి వారు తెలిపారు. మరియు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయంల  ఉత్సవముల సందర్భంగా జూలై 14న విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి విచ్చేసి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ఉమ్మడి దేవాలయంలో కమిటీ వారు ఆహ్వానించిన మేరకు జులై 14న దేవస్థానం నుండి ఉమ్మడి దేవాలయంల లోని అమ్మవార్లకు  పట్టు వస్త్రాల సమర్పించనునట్లు తెలిపారు.

అనంతరం ఆలయ స్థానాచార్యుల వారు మరియు ప్రధాన అర్చకుల వారు మాట్లాడుతూ ఆషాడ మాసంలో అమ్మవారికి సారు సమర్పణ మరియు శాకంబరీ దేవి ఉత్సవంల విశిష్టతను తెలియజేసి, ప్రజలందరూ పాల్గొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు.

Comments