సుపరిపాలన అందజేస్తూ గ్రామీణ రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి !!


 

ఉయ్యూరు : జూన్ 01, (ప్రజా అమరావతి);


*సుపరిపాలన అందజేస్తూ గ్రామీణ రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి !!*


   *--- జిల్లా కలెక్టర్  పి. రాజాబాబు**--కృష్ణాజిల్లాలో 1 లక్షా 55 వేల 004 మంది రైతులకు 116.25 కోట్ల పెట్టుబడి సాయం అందజేత*


*----ఖరీఫ్ కు పెట్టుబడి అందడంతో రైతుల్లో పెల్లుబికిన ఆనందోత్సవాలు*


రైతుల ప్రయోజనాలు కాపాడుతూ వారి అభివృద్ధికి-సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందజేస్తూ గ్రామీణ రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు కొనియాడారు. 


 గురువారం ఉదయం కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలోని కాకర్ల కన్వెన్షన్ హాల్ లో వైఎస్సార్ రైతు భరోసా - పి ఎం కిసాన్ 2023 -24 మొదటి విడత రైతు భరోసా , మార్చి ఏప్రిల్ మే నెలలో అకాల వర్షాల - ఇన్ ఫుట్ సబ్సిడీ విడుదల జిల్లా కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. 


రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తల చర్చాగోష్ఠి అనంతరం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మెన్ జన్ను రాఘవరావులతో కలిసి జ్యోతే ప్రజ్వలన చేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించారు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే ప్రార్ధన గీతంతో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధ సారధి అధ్యక్షతన ఈ సభ ప్రారంభమైంది.  


తొలుత కర్నూలు జిల్లా పత్తికొండ నుండి గురువారం వై ఎస్సార్ రైతు భరోసా - పి ఎం కిసాన్ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి రైతులకు ఇచ్చిన సందేశాన్ని పెద్ద ఎల్ ఈ డి బిగ్ స్క్రీన్ ద్వారా హాజరైన రైతులందరికీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించారు. 


అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, కృష్ణాజిల్లాలో 2023 - 24 మొదటి విడత వై ఎస్సార్ రైతు భరోసా - పి ఎం కిసాన్ పథకానికి 1 లక్షా 55 వేల మంది రైతులకు 116 . 25 కోట్ల రూపాయల నగదు వారి ఖాతాలలో జమ కాబడిందన్నారు. ఖరీఫ్ కు ముందే ప్రభుత్వం రైతున్నకు పెట్టుబడి సమకూర్చడం గతంలో ఎన్నడూ జరగని విషయమన్నారు. ఈ సహాయాన్ని రైతులు సక్రమంగా వినియోగించుకొవాలని కలెక్టర్ సూచించారు.


ఈ విడతలో అర్హత కలిగిన భూ యజమానులకు 1,46,943 మంది రైతులు) 7500/- చొప్పున( పి.యం. కిసాన్ 2000/- కలుపుకుని), కౌలు రైతులకు (8046 మంది రైతులు) మరియు అటవీ భూములు సాగు చేస్తున్న (బాపులపాడు మండలం -15 మంది రైతులకు) రూ. 7500/- చొప్పున విడుదల చేయబడుచున్నది.


కృష్ణా జిల్లాలోని నియోజక వర్గాలలో మండలం వారీగా విడుదల చేయబడుతున్న 2023-24 సంవత్సరం 5 వ ఏడాది రైతు భరోసా-పి.యం కిసాన్ మొదటి విడత వివరములు కలెక్టర్ చెప్పారు. 


2023 మార్చి,ఏప్రిల్, మే, నెలలలో కురిసిన అకాల వర్షములు కారణంగా ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ జరిగింది. 

కృష్ణాజిల్లాలో మార్చి/ఏప్రిల్ /మే, 2023 లో కురిసిన అకాల వర్షాల కారణంగా 2200.55 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు 33 శాతం పైబడి నష్ట పోయిన 2871 మంది రైతులకు రూ 2.45 కోట్లు ( రెండు కోట్ల నలభై అయిదు లక్షల రూపాయలు మాత్రమే) ఇన్ పుట్ సబ్సిడీ 01.06.2013 బ్యాంక్ అక్కౌంట్ లోనికి నేరుగా జమచేయబడిందన్నారు.


అలాగే అకాల వర్షాలకు కల్లాల్లో ఉండి 50 శాతం పైగా దెబ్బతిన్న 125 ఎకరాలలోని 138 మంది మొక్కజొన్న, జొన్న రైతులకు క్వింటాలుకు రూ 500/- చొప్పున రూ.41.00 లక్షలు వారి బ్యాంక్ అక్కౌంట్ లోకి జమ చేయబడిందని కలెక్టర్ తెలిపారు


వ్యవసాయానికి ఎరువులు ,విత్తనాలు , వ్యవసాయ సంబంధిత సామాగ్రి , అవసరమైన సమాచారం , సంబంధిత అధికారులు ఆయా గ్రామాల్లోనే అందుబాటులో ఉంటూ రైతులకు అవసరమైన ప్రతిదీ అందజేస్తూ వారికి మేలు కలిగే విధంగా పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలను దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయంగా కూడా పలు విదేశీ ప్రభుత్వాలు ఏపీ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకొని పనిచేస్తున్నాయన్నారు. 


తర్వాత పామర్రు శాసనససభ్యులు కైలే అనిల్ కుమార్ ప్రాసంగిస్తూ, గతంలో రైతులకు సరైన సలహాలు ఇచ్చేవారే ఉండేవారు కాదని, నేడు ఒక్కొక గ్రామంలో దాదాపు కోటి రూపాయల వ్యయంతో   ఆర్బికేల స్థాపన, సచివాలయ వ్యవస్థ వంటి సామాజిక వ్యవస్థలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సమకూర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కృష్ణాజిల్లాకు నూతన కలెక్టర్ గా వచ్చిన పి. రాజాబాబు అప్పటికి ధాన్యం కొనుగోలు సమస్యను ఎదుర్కొంటున్న రైతుల ఇబ్బందిని రోజుల వ్యవధిలో పరిష్కరించిన కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఎమ్మెల్యే  కైలే అనిల్ కుమార్ తెలిపారు.     


పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందచేస్తూ, ఇప్పటివరకు 3 లక్షల కోట్లు ప్రజల కోసం వెచ్చించిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రమే అని అన్నారు. ఆయన అమలు చేసే ఏ కార్యక్రమంలోనైనా కేవలం అర్హతే ప్రామాణికంగా చూస్తారన్నారు. రైతు భరోసా కేంద్రాల పని తీరును మరింత బలోపేతం చేసి ఏ ఒక్క రైతు ప్రైవేట్ రైస్ మిల్లర్ వద్దకు వెళ్లి ఆర్ధికంగా నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణాజిల్లాలో 5 లక్షల 50 వేల టన్నుల ధాన్య సేకరణ లక్ష్యం కాగా అంతకు మించి దిగుబడులు కృష్ణాజిల్లాలో వచ్చాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. అమలులో ఏమైనా స్వల్ప లోపాలు ఏర్పడవచ్చు కానీ, రైతుకు మేలు చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనా విధానం ఎంతో ఉన్నతమైనదని , అన్ని రంగాల్లో వినూత్న పరిపాలన విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ధీరుడు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి కీర్తించారు.


అనంతరం సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ స్టాళ్లను పరిశీలించారు, అలాగే సబ్సిడీపై అందజేయనున్న ట్రాక్టర్లు హార్వెస్టర్లు, వివిధ వ్యవసాయ పరికరాల యంత్ర సామాగ్రిని పర్యవేక్షించారు.


ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణరావు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ తాతినేని పద్మావతి, ఏఎంసీ చైర్మన్ వల్లభనేని వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారిణి విజయభారతి, ఉద్యానవన శాఖాధికారిణి జ్యోతి, పశుసంవర్ధక శాఖ అధికారి చంద్రశేఖర్, కంకిపాడు జడ్పిటిసి బి కోటేశ్వరరావు, ఎంపీపీ కల్పనా కుమారి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, డాక్టర్ గిరిజారాణి డాక్టర్ సుధారాణి, జిల్లా వ్యవసాయ శాఖ ఏడి నీలం మణిధర్ తదితరులు పాల్గొన్నారు.*కృష్ణాజిల్లాలో వైయస్సార్ రైతు భరోసా లబ్ధిదారుల అభిప్రాయాలు**1.మోర్ల సత్యనారాయణ*

 *పెద పులిపాక*

*కౌలు రైతు* 


తాను 20 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటానని, గతంలో ప్రతి ఖరీఫ్ సీజలకు ముందు పెట్టుబడి కోసం వడ్డీలకు డబ్బులు తెచ్చి చాలా ఇబ్బందులు పడేవాడినని మోర్ల సత్యనారాయణ అనే రైతు పేర్కొన్నాడు.. వరుసగా ఐదు విడతల నుంచి తనకు పెట్టుబడి ప్రభుత్వం ఇస్తుందన్నారు. తనలాంటి ఎందరో రైతులకు జగన్ ప్రభుత్వం చేస్తున్న మేలు ఎంతో ఉపయోగకరమైనదని తన అభిప్రాయం తెలిపారు.*2. దోనేపూడి శ్రీహరి*

*చిన ఓగిరాల*

*కూరగాయల రైతు*


తాను మెట్ట వ్యవసాయం చేస్తుంటానని కౌలుకు కొంత భూమిని తీసుకొని కూరగాయల పండిస్తానని దోనేపూడి శ్రీహరి తెలిపారు. గతంలో కూరగాయలకు బాగా ధర ఉన్న రైతుకు ఆధార గట్టిది కాదని, కారణం పెట్టుబడులకు వారి వద్ద నుంచి అప్పులు పొందడం వల్ల కూరగాయలను చవకగా అమ్మాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వం నేడు తమకు పెట్టుబడి నేరుగా ఎకౌంట్లలలో జమ చేయడంతో ఆ ఇబ్బంది కలిగిందన్నారు.. కూరగాయలను మార్కెట్లో ఉన్న ధరకు ఇప్పుడు అమ్ముతున్నామని తెలిపారు.

Comments