రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి.


నెల్లూరు (ప్రజా అమరావతి);



జిల్లాలో జరుగుచున్న  రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాల


ని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, అధికారులను ఆదేశించారు.


మంగళవారం  ఉదయం కలెక్టరేట్లోని ఎస్ఆర్  శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హల్లో  జిల్లా  కలెక్టర్  హరి నారాయణన్,  జాయింట్  కలెక్టర్  కూర్మనాథ్ తో కలసి   రెవెన్యూ డివిజనల్ అధికారులు,  సర్వే ఇన్స్పెక్టర్స్ తో సమావేశమై  జిల్లాలో జరుగుచున్న  రీ సర్వే ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు.  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లుకు తావు లేకుండా  పటిష్టంగా చేపట్టడంతో పాటు రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.  ప్రతి మంగళవారం  రీ సర్వే కార్యక్రమం  అమలు పై సమీక్షించడం జరుగుతుందని,  ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ  రీ సర్వే ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని స్టేజీ వారి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించిన  గడువు లోపు పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు.  ఈ రీ సర్వే ప్రక్రియలో  రెవిన్యూ, సర్వే శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే  నిర్దేశించిన గడువు లోగా రీ సర్వే కార్యక్రమం పూర్తి కాగలదన్నారు.  మిషన్ మోడ్ లో రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాల్సి వుండగా, క్షేత్రస్థాయిలో  సర్వే అధికారులు అందుకనుగుణంగా  పనిచేయడం  చేయడం లేదని జిల్లా కలెక్టర్  అసంతృప్తిని  వ్యక్తం చేశారు. రీ సర్వే ప్రక్రియ పై  స్టేజీ వారీగా   గడువులను నిర్ణయించడం  జరిగిందని,  రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పని చేసి నిర్ధేశించిన  గడువు లోపు  పూర్తిచేసేలా రీ సర్వే  కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 


ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, అసిస్టెంట్ కలెక్టర్ విధ్యాదరి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఆత్మకూరు, కావలి ఆర్.డి.ఓ లు కరుణకుమారి, శీనా నాయక్, జిల్లా   సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారి హనుమాన్ ప్రసాద్,  సర్వే ఇన్స్పెక్టర్స్, కలెక్టరేట్  సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు. 




Comments