కార్తీక మాసంలో శ్రీశైల దేవస్థానంలో కుంబాభిషేకం.

 *కార్తీక మాసంలో శ్రీశైల దేవస్థానంలో కుంబాభిషేకం


*

*•విజయవాడలో ఎనిమిది ఆగమాలను సంకలనం చేస్తూ ఘనంగా యజ్ఞ నిర్వహణ*

*•ఫలితంగా సి.ఎం.ప్రయత్నానికి, యాగ ఫలం తోడై  రాష్ట్రాన్ని నిధుల వరద ముంచెత్తింది*

*•హథీరామ్ జీ మఠానికి  ఫిట్ పర్సెన్ని నియమంచాలని ధార్మిక పరిషత్ నిర్ణయం*

*•దేవాదాయ భూముల పరిరక్షణకు దేశంలోనే విప్లవాత్మకమైన  చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం*

*ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*

                                                                                                                                                                                    అమరావతి, జూన్ 8 (ప్రజా అమరావతి) :  పండితులు, పీఠాథిపతులు సూచనలమేరకు  మహాశివునికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో శ్రీశైల దేవస్థానం కుంబాభిషేకం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం సూచనల మేరకు ఇప్పటికే పలువురు పీఠాథిపతులు, పండితులను ఈ విషయంలో సంప్రదించడంమైందని, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ మరియు ఇతర పండితులను కూడా త్వరలోనే సంప్రదించనున్నట్లు ఆయన తెలిపారు.  గురువారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్  సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మట్లాడుతూ  నేడు రాష్ట్ర ధార్మిక పరిషత్ సమావేశం జరిగిందని ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.  


ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కొట్టుసత్యనాయణ మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానంలో శివాజీ మహారాజ్ కట్టించిన  ఉత్తర రాజగోపురం పాడైపోయిన నేపథ్యంలో 2014లో దాన్ని పునర్నించినప్పటికీ ఆగోపురం పై కలశాల స్థాపన జరుగలేదన్నారు.  ఈ విషయం తమ ప్రభుత్వ దృష్టికి రాగానే  టి.టి.డి. వారికి ఆరు కేజీల బంగారాన్ని ఇచ్చి ఆ కలశాలను చేయించమైందన్నారు. యజ్ఞ యాగాదులతో ఆ కలశాలను ఉత్తర రాజగోపురం పై ప్రతిష్టించి ఈ ఏడాది మే మాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా కుంబాభిషేకం చేయించాలనుకున్నామన్నారు.  అయితే  మండు వేసవిలో ఎంతో ఎత్తులో ఉన్న ఉత్తర రాజగోపురం ఎక్కి కలశాల కుంబాభిషేకం చేయడం ఎంతో కష్టమని,  భక్తులు కూడా ఈ కార్యాక్రమానికి మండు వేసవిలో వచ్చేందుకు ఎంతో ఇబ్బందిగా ఉంటుదని కంచికామకోటి పీఠాధిపతితో పాటు పలువురు పండితులు చేసిన సూచనలు, సలహాలు మేరకు ఈ కుంబాభిషేక కార్యక్రమాన్ని వాయిదా వేయడమైందన్నారు. కంచి కామకోటిపీఠాథిపతులతో పాటు పలువురు పీఠాథిపతులు, పండితులను ఈ విషయంలో సంప్రదించగా కార్తీక మాసంలో చేయడం ఎంతో ఉత్తమమని సలహా ఇవ్వడం జరిగిందన్నారు.  వారి సూచనలు,  సలహాల మేరకు ఈ కుంబాభిషేక కార్యక్రమాన్ని కార్తీక మాసంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 


*సి.ఎం.ప్రయత్నానికి, యాగ ఫలం తోడై  రాష్ట్రాన్ని నిధుల వరద ముంచెత్తింది…..*


దేశ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఎక్కడా జరుగని విధంగా ఎనిమిది ఆగమాలను సంకలనం చేస్తూ గత మాసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిఫల్ స్టేడియంలో  ఆరు రోజుల పాటు ఎంతో ఘనంగా అష్టోత్తర శత కుండాత్మక చండీ,రుద్ర,రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయాజ్ఞాన్ని నిర్వహించడమైందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ యజ్ఞాన్ని ప్రత్యక్షంగానే కాకుండా  ఆన్లైన్ ద్వారా పరోక్షంగా  ఎన్నో లక్షల మంది వీక్షించడం జరిగిందన్నారు. ఈ యజ్ఞం యొక్క ఫలితం మనకు కనబడుతున్నదని,  రాష్ట్ర ముఖ్యమంత్రి ప్ర్రయత్నానికి  ఈ యాగ ఫలం తోడై  ఎప్పటి నుండో కేంద్రం నుండి   రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ యజ్ఞం తదుపరి  రాష్ట్రానికి వరదలాగా రావడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు.

 

*హథీరామ్ జీ మఠానికి ఫిట్ పర్సెన్ని నియమించాలని ధార్మిక పరిషత్  నిర్ణయం……*


తిరుపతి హథీరాం జీ మఠానికి  ఫిట్ పర్సెన్ని నియమించాలని   రాష్ట్ర ధార్మిక పరిషత్ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ ఆ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడినట్లు, మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు, కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసినట్లు ప్రభుత్వం వేసిన కమిటీలో వెల్లడైందన్నారు. ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేకుండా అర్జున్ దాస్ కోర్టుకెళ్లారన్నారు. అందుకే ధార్మిక పరిషత్ ద్వారా స్వామీ హథీరాం జీ మఠం మహంత్ గా ఉన్న అర్జున్ దాస్ ను సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హథీరామ్ జీ మఠానికి ఫిట్ పర్సన్ని నియమించాలని నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. 


*దేవాదాయ భూముల పరిరక్షణకు దేశంలోనే విప్లవాత్మాకమైన చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం…..*

రాష్ట్రంలోని దేవాదాయ భూముల పరిరక్షణకు దేశంలోనే విప్లవాత్మకమైన చట్ట సవరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదించిందని  ఉప ముఖ్యమంత్రి కొట్ట సత్యనారాయణ తెలిపారు. పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ ఆస్తులను కాపాడు కోవడటానికి ఈ చట్ట సవరణ ఎంతో సహకరిస్తుందన్నారు. అన్యాక్రాంతం అయిన భూములను స్వాదీనం చేసుకోవాలంటే ట్రిబునల్ లో ఆర్డు తెచ్చుకొని చర్యలు తీసుకొనే అవకాశం ఉండేదని, అయితే ఇప్పుడు నోటీసు ఇచ్చి పోలీసుల సహకారంతో అన్యాక్రాంత అయిన భూములను స్వాదీనం చేసుకొనే అవకాశం ఈ చట్టసవరణ ద్వారా  ప్రభుత్వానికి ఏర్పడిందన్నారు. ఆలయాల ఆస్తుల అక్రమణ, లీజు గడువు ముగిసినా అన్యాక్రాంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీల్లేకుండా చట్ట సవరణ చేయడం జరిగిందని తెలిపారు. ఆలయాల ఆదాయం మారుతూ ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొనే విధంగా దేవాదాయ, ధర్మాదాయ చట్టంలోని సెక్షన్ 6  ని సవరించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.


రాష్ట్రంలో మొత్తం 24,699 దేవాలయాలు, సత్రాలు ఉన్నాయని, వీటిలో 22,678 దేవాలయాలు, 130 మఠాలు మరియు 1,891 సత్రాలు ఉన్నాయన్నారు.  మొత్తం 22,678 దేవాలయాల్లో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలు 21,454 ఉన్నాయని, రూ. 5 లక్షలకు పైబడి రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలు  1,173 మరియు రూ.25 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న దేవాలయాలు 174 మరియు  28 సత్రాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.  అయితే కోర్టు అదేశాలకు అనుగుణంగా  రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్టుబోర్డులు నియమించకుండా వాటి నిర్వహణ భాద్యతను ఫౌండర్లకు, అర్చకులకు అప్పగించి మరియు వాటి పర్యవేక్షణా బాధ్యతను దేవాదాయ శాఖ అధికారులు చూసుకోవాల్సిఉందన్నారు.  ఆలయాల ఆస్తులను అమ్మడం కాని, సొంతంగా లీజుకు ఇవ్వడం గాని నిర్వహకులకు ఉండదన్నారు.  ఆలయాల ఆస్తులు ఆక్రమణకు గురైనా, లీజు పీరియడ్ అయిపోనా నిబంధలకు విరుద్దంగా కొనసాగుతూ ఉంటే దేవాదాయ శాఖ అధికారులే దాన్ని స్వాదీనం చేసుకొనే విధంగా చట్ట సవరణ చేయడం జరిగిందని తెలిపారు. Comments