వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ షాపును తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు.రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి); 
బుధవారం  రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ ఇంచార్జ్  సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు  కె. కుమార్  ఆద్వర్యంలో విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సంయుక్తముగా తూర్పు గోదావరి జిల్లాలోని సీతానగరం మండలం  సీతానగరం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర ఫర్టిలైజర్స్ (విత్తనములు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారం)ను తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు సదరు షాపు నందు ప్రభుత్వంచే నిషేదించిన 5 (ఐదు) లీటర్ల Glyphosate 41%SL కలుపు మందు నిల్వలను గుర్తించడం జరిగింది.  ప్రభుత్వం నిషేదించిన కలుపు మందు నిల్వలను షాపు నందు కలిగివుంచుటచే పురుగు మందుల చట్టం 1968కు విరుద్ధం అని తెలిపి, రూ 3,975/- విలువ గల 5 (ఐదు) లీటర్ల నిషిద్ధ స్టాక్ ను సీజ్ చేసి డీలర్ పై ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, రాజమహేంద్రవరం నందు కేసు నమోదు చేయడమైనదన్నారు. షాపు నందు లభ్యత గల విత్తనములకు సంబంధించి ప్రిన్సిపల్ సర్టిఫికేట్‌ను తనిఖిల సమయములో డీలర్ సమర్పించక పోవుటచే, విత్తనములకు సంబందించి గ్రౌండ్ స్టాక్ మరియు బుక్ స్టాక్ మధ్య వ్యత్యాసం వుండుట చేత  మండల వ్యవసాయ అధికారి, సీతానగరం వారిచే సదరు షాపు యజమాని పై  6-ఏ క్రింద కేసు నమోదు చేసి రూ 2,85,900/-  విలువ గల సుమారు 3040 కేజీల విత్తనములను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. 


ఈ తనిఖిలలో డి. ఎస్. పి పి ముత్యాలనాయుడు, కార్యాలయ ఇన్స్పెక్టర్  రమేష్, విజిలెన్స్ వ్యవసాయ అధికారి భార్గవ మహేష్, సీతానగరం మండల వ్యవసాయ అధికారి రమేష్,కానిస్టేబుల్స్ వీరబాబు, ఈశ్వర్ తదితరులు  పాల్గొన్నారు.


Comments