జగనన్నకు చెబుదాం (స్పందన )కార్యక్రమంలో వస్తున్న ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి.

 

నెల్లూరు: జూన్19 (ప్రజా అమరావతి);

జగనన్నకు చెబుదాం (స్పందన )కార్యక్రమంలో వస్తున్న ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాల


ని అవసరమైతే వ్యక్తిగతంగా ఆర్జీదారుల వద్దకు వెళ్లి పరిశీలించి సంతృప్తికర పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం. హరి నారాయణన్ అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హరి నారాయణన్,జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాధ్ ,డిఆర్ఓ వెంకట నారాయణమ్మ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీదార్ల సమస్యలను సావధానంగా వింటూ ఇచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పుష్కరించాలని, అందిన అర్జీలు సక్రమంగా పరిష్కరించి మరలా రీ ఓపెన్ కాకుండా సరైన పరిష్కారం అర్జీదారునికి చూపించాలన్నారు.

నెల్లూరు జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ తరపున మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణయ్య నేతన్న నేస్తం కింద మగ్గాలు ఉన్నవారికందరికి నేతన్న నేస్తం పథకం వర్తింపజేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుఅర్జీ అందజేయగా పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.

విడవలూరు మండలం ముదివర్తి గ్రామానికి చెందిన దివ్యాంగుడు మహమ్మద్ షరీఫ్ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి తిక్కన ప్రాంగణానికి వచ్చారు. అర్జీదారులు ఎక్కువగా ఉండటంతో కలెక్టర్ లేచి షరీఫ్ వద్దకు వచ్చి సమస్య గురించి అడిగారు.

కొంతమంది దివ్యాంగులు 1975 నుండి చేసుకుంటున్న భూమిని కొంతమంది ఆక్రమించి కరెంటు మీటర్లను కూడా తమ పేరుకు మార్చుకున్నారని తమకు  న్యాయం చేయాలని కోరగా సంబంధిత ఆర్డిఓ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని దివ్యాంగుడికి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో డిఇఓ గంగాభవాని, డిపిఓ సుస్మిత, పి డి డి ఆర్ డి ఎ సాంబశివారెడ్డి, జిల్లా రిజిస్త్రార్ బాలాంజనేయులు, ఏ డి ల్యాండ్ సర్వే హనుమాన్ ప్రసాద్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, మెప్మా పిడి రవీంద్ర డిఎంహెచ్వో పెంచలయ్య, డి సి హెచ్ ఎస్ రమేష్ , పిడి హౌసింగ్ నాగరాజు

సంక్షేమ శాఖ అధికారులు వెంకటయ్య ,రమేష్, నిర్మలాదేవి, పరిమళ, ఇరిగేషన్, విద్యుత్ ఇంకా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments