ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు బ్లడ్ క్యాన్సర్ బాలుడికి జిల్లా కలెక్టర్ రూ.1 లక్ష ఆర్థిక సాయం.*ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు బ్లడ్ క్యాన్సర్ బాలుడికి జిల్లా కలెక్టర్ రూ.1 లక్ష ఆర్థిక సాయం


*


పల్నాడు జిల్లా,24 జులై, (ప్రజా అమరావతి ): 


*పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండలం, రామిరెడ్డి పాలెం కు చెందిన కేతే సూర్య ఆదిత్య రెడ్డి అనే 14 ఏళ్ల బాలుడు గత కొంత కాలంగా  బ్లడ్ క్యాన్సర్ స్టేజ్-Iతో బాధపడుతున్నారు*


 *గుంటూరు జిల్లా వెంకటాయపాలెం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రిని బాలుడి తండ్రి నాగేశ్వర రెడ్డి తన బాలుడితో కలిసి  బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్న కేతే సూర్య ఆదిత్య రెడ్డి కి వైద్య సహాయం కోసం ఆర్ధిక సహాయం చేయాలని కోరారు*


*వెంటనే స్పందించిన ముఖ్య మంత్రి బాలునికి రూ .1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ను ఆదేశించారు*స్పందించిన పల్నాడు జిల్లా కలెక్టర్  శివశంకర్ లోతేటి, నరసారావుపేట నియోజక వర్గ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి  లు పల్నాడు కలెక్టరేట్‌లో సోమవారం  బ్లడ్ క్యాన్సర్ స్టేజ్-Iతో బాధపడుతున్న

కేతే సూర్య ఆదిత్య రెడ్డి తండ్రికి రూ.1  లక్ష  చెక్కును అందించారు.


బాలుడి కి ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు బాలుడికి మెరుగైన వైద్య సేవలను చేయిస్తామని హామీ ఇచ్చారు.

Comments