మంగళగిరిలో జియో భారత్ కీప్యాడ్ 4g మొబైల్ ఫోన్ ఆవిష్కరణ.

 *మంగళగిరిలో జియో భారత్ కీప్యాడ్ 4g మొబైల్ ఫోన్ ఆవిష్కరణ**మొబైల్ ను లాంచ్ చేసి పేద మహిళకు ఉచితంగా అందజేసిన ఈఓ రామకోటి రెడ్డి.                                        మంగళగిరి (ప్రజా అమరావతి);

ఎప్పటికప్పుడు సంచలన ఆఫర్లతో దూసుకుపోతున్న జియో తాజాగా జియో భారత్ కీప్యాడ్ 4g మొబైల్ ఫోన్ ను ప్రవేశపెట్టిన విషయం  విధితమే. అతి తక్కువ ధరకు లభించే ఈ 4g కీ ప్యాడ్ మొబైల్ అమ్మకాలు మంగళగిరిలో గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొబైల్ ను లాంచ్ చేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి చేతుల మీదుగా జియో భారత్ 4g మొబైల్ ఫోన్ ను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఓ పేద మహిళకు ఈఓ రామకోటి రెడ్డి చేతుల మీదుగా జియో భారత్ 4g కీప్యాడ్ మొబైల్ ఫోన్ ను ఉచితంగా అందజేయించారు. ఈ కార్యక్రమంలో జియో స్టేట్ హెడ్ దుగ్గిరాల నిరంజన్,జియో సెంటర్ మంగళగిరి మేనేజర్ కృష్ణ ప్రసాద్,మంగళగిరి మోబిలిటి లీడ్ జోసఫ్ యాంలోని జియో మంగళగిరి డిస్టిబ్యూటర్ ఇంజమూరి నాగ దుర్గ వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


*రూ 999 కె 4g మొబైల్*


2g 3g  సేవలకు విముక్తి కలిగిస్తూ జియో భారత్ మొబైల్ కీ ప్యాడ్ ఫోన్ 4g సేవలను అందించనుంది.నెల వారీ ప్లాన్ రూ.123 కు డైలి.5 జిబి నెట్ ఆన్ లిమిటెడ్ కాల్స్ సదుపాయం కల్పించారని జియో డిస్టిబ్యూటర్ ప్రసాద్ తెలిపారు.వైర్ లెస్ ఎఫ్ ఎమ్ రేడియో,జియో సినిమా,అన్ని భాషల పాటలు,కెమెరా expandable memory 128 gb అందించారని తెలిపారు.కేవలం దీని ధర రూ.999 మాత్రమేనని తక్కువ ధరకు కీప్యాడ్ మొబైల్ కొనుగోలు చేయాలి. ఇంటర్నెట్ సదుపాయం కావాలి అనుకునే వారికి జియో భారత్ సరైనదని అన్నారు.


Comments