గండాలయ్య స్వామి వారి ఆలయ పరిసరాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం - ఎమ్మెల్యే ఆర్కే..

 గండాలయ్య స్వామి వారి ఆలయ పరిసరాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం - ఎమ్మెల్యే ఆర్కే..



ఇప్పటికే ప్రతి ఒక్కరు అనువుగా స్వామివారిని దర్శించుకునేందుకు అటవీ శాఖ వారి ట్రెక్కింగ్ మార్గం...

మంగళగిరి (ప్రజా అమరావతి);

పర్యావరణ పరిరక్షణలో భాగంగా గండాలయ్య స్వామి కొండపై మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు...


ఈ రోజు ఉదయం 6:30 గంటలకు గండాలయ్య స్వామి కొండపై పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, పానకాల స్వామి కొండ అగ్రభాగంలో ఉన్న గండాలయ్య స్వామి వారి విశిష్టత ప్రజలందరికీ తెలిసిందేనని...


ఇప్పటికే కొండపైనున్న గండాలయ స్వామి వారికి భక్తులు ఒక కమిటీగా ఏర్పడి సుమారు కోటిన్నర రూపాయలతో శాశ్వత దేవాలయ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు..


దాతల సహకారంతో అన్నదాన సత్రం ఏర్పాటు చేసుకున్నామని...


దీనితో పాటు సుమారు 3 ఎకరాల పైన ఉన్న గండాలయ స్వామి వారి కొండపై ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు..


కలుషితమవుతున్న పర్యావరణాన్ని కాపాడుకునేందుకు సుమారు కొండపై 150 పుష్ప మరియు పళ్ళ మొక్కలను నాటడం జరిగిందని.., తద్వారా నగర ప్రజలకు కొండపై నుంచి చక్కటి ఆక్సిజన్ అందించేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు..


ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న అధికారులకు మరియు దాతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు..


అటవీ శాఖ వారు ఏర్పరచిన చక్కటి ట్రెక్కింగ్ మార్గం ద్వారా ప్రజలందరూ గండాలయ్య స్వామి వారిని దర్శించుకోవాలని పిలుపునిచ్చారు..


అలాగే ప్రతి ఒక్కరూ తమతమ పరిసరాలలో విరివిగా మొక్కలు నాటాలని కోరారు.

Comments