స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.మచిలీపట్నం జులై 24 (ప్రజా అమరావతి);


స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాల


ని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.


సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్ లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు.


ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించారు.   సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.


జిల్లా అధికార యంత్రాంగం స్వీకరించిన అర్జీలలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:


ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై వి బి రాజేంద్రప్రసాద్, ఉమ్మడి కృష్ణాజిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గోలి వసంత కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం  గ్రామ పంచాయతీలకు కేటాయించిన  14, 15 వ ఆర్థిక సంఘాల నిధులు తమకు వెంటనే విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.


జిల్లాలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వాటిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేశారు.


పెడన మండలం నందిగం గ్రామ రైతులు పామర్తి కోటేశ్వరరావు పి నాగబాబు మాట్లాడుతూ తమకు 400 ఎకరాల పొలం ఉన్నదని తూర్పుగోదావరి జిల్లా భీమవరం వాస్తవ్యులు మురళీకృష్ణ బాబు మరికొందరు సరిహద్దు లో ఉన్న కొంత పొలం తీసుకుని చెరువు త్రవ్వి 10 అడుగుల కట్టపోస్తున్నారని దాంతో మురుగునీరు ఏ చిన్నపాటి వర్షం పడిన కాలువలు వచ్చిన పోకుండా పంట పొలాలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతూ తమకు న్యాయం చేయాలని విజ్ఞాపన పత్రం అందజేశారు.


కోడూరు మండలం వి కొత్తపాలెం కి చెందిన  బి.సీతారావమ్మ అనే ఒక వృద్దురాలు నిలబడలేని స్థితిలో అర్జీ ఇవ్వడానికి రాగా కలెక్టర్ వెంటనే స్పందించి ఆమెకు ప్రత్యేకంగా ఒక కుర్చీ వేయించి ఆమె సమస్యను ఎంతో ఓపికగా  ఆలకించారు.

తనకు ఏడు మంది కుమారులని ఒక కుమారుడు చనిపోయాడని, మిగిలిన 6 మందిలో చిన్న కుమారుడు దగ్గర తాను ఉంటున్నానని తరచూ తన కుమారులు తరచూ కుటుంబ సమస్యలతో తగాదాలు పడి మనశ్శాంతి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆర్డిఓ కిషోర్, పోలీసు అధికారిని పిలిపించి ఆమె సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.


ఈ సందర్భంగా  కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి  వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధతో సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ డ్వామా పిడిలు పిఎస్ఆర్ ప్రసాద్, జి వి సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిఎస్ఓ పార్వతి, ముడా వీసి రాజ్యలక్ష్మి, డిఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, డీఈవో తెహరా సుల్తానా డి సి హెచ్ ఎస్ ఇందిరా దేవి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ జగన్నాథరాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు పంచాయతీరాజ్ ఎస్ ఈ విజయకుమారి, ఉద్యాన అధికారి జే. జ్యోతి,  జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు , తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. Comments