రాష్ట్రంలో "రైతు స్వర్ణ యుగం" నడుస్తోంది..!!*రాష్ట్రంలో "రైతు స్వర్ణ యుగం" నడుస్తోంది..!!** *రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి*


* *పులివెందుల IGGCARL ప్రాంగణంలో రైతు సాధికార సంస్థ అద్వయంలో నాలుగేళ్ళ "ఫార్మర్ సైంటిస్టు కోర్సు" మొదటి బ్యాచ్ ను ప్రారంభించిన మంత్రి.*


పులివెందుల, జూలై 22 (ప్రజా అమరావతి): ప్రజల ఆకలి తీర్చే రైతాంగానికి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న మన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో "రైతు స్వర్ణ యుగం" సాగుతోందని.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


శనివారం పులివెందుల పట్టణంలోని IGGCARL ప్రాంగణంలో రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు పరిశోధన కోర్సు.. అకాడమిక్ మొదటి బ్యాచ్ ను  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోపాటు.. జేసీ జి.గణేష్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, రాష్ట్ర ఉద్యాన సలహాదారు పి.శివ ప్రసాద్ రెడ్డి,  పులివెందుల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో వెంకటేశులు,  పురపాలిక చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్  హఫీజుల్లా, రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, కమీషనర్ నరసింహా రెడ్డి, మార్కెట్ చైర్మన్ చిన్నప్ప, ప్రత్యేకాధికారి శివారెడ్డి హాజరయ్యారు.


ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పాదకతను పెంపొందించడమే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అని.. ఆ దిశగా ప్రకృతి వ్యవసాయంను రాష్ట్రంలో విస్తృతం చేయడం జరుగుతోందన్నారు. వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం అమలు చేస్తున్న విధానాలను దేశం యావత్తు ప్రశంసిస్తూ ఉందన్నారు. కోట్ల ఆస్తులు వున్నా.. మంచి ఆరోగ్యం లేకపోతే దేన్నీ అనుభవించలేమనే నిజాన్ని ఉదహరణలతో మంత్రి వివరించారు. పాలకుడు మంచివాడయితే.. రాజ్యం సుభిక్షంగా వుంటుందనే సామెతను చక్కటి నిదర్శనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. రైతు పక్షపాతి అయిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, ఆవిష్కరణలు చేస్తూ దేశ వ్యవసాయ రంగానికే ఆదర్శనీయం అన్నారు. 


రైతు ప్రతి రైతు భరోసా కేంద్రం ఒక వ్యవసాయ పరిశోధనా శాల కావాలనే.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షకు.. రైతు సాధికార సంస్థ కార్య రూపాన్నిస్తోందన్నారు.  2030 నాటికి ప్రపంచానికి ఆహార కోరత కాలేకుండా తీర్చాలనే యూనిసెఫ్ లక్ష్యాన్ని అధిగమించేందుకే రైతులను శాస్ట్రీయంగా విద్యావంతులను చేయడం జరుగుతోందన్నారు. వ్యవసాయంలో రసాయన ఉపయోగాన్ని పూర్తిగా తగ్గించి.. సహజసిద్ధమైన ఎరువులను వాడటం వల్ల, పర్యావరణ సహిత ఆరోగ్యకరమైన దిగుబడులను ఉత్తత్తి చేయడం ఈ రైతు శాస్త్రవేత్త కోర్సు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. 

అందుకు అనుగుణంగా.. సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు... క్షేత్ర స్థాయిలో పూర్తిస్థాయి అవగాహన పెంపొందించడం, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో అమలు చేస్తున్న పలు సహజసిద్ద సాగుబడి పద్దతులను పరిచయం చేయడం జరుగుతుందన్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రాన్ని ప్రకృతి వ్యవసాయ పరిశోధనలకు, వ్యవసాయ విజ్ఞానానికి మూల బిందువుగా.., ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా సంకల్పించిందన్నారు. మితిమీరిన రసాయన వాడకాలను తగ్గించి.. సబ్సిడి ఎరువుల రూపంలో ప్రతి ఏటా ప్రభుత్వాలపై లక్షల కోట్ల రూపాయల భారాన్ని తగ్గించాలనే సదుద్దేశ్యంతో.. ప్రతి రైతు పొలంలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగులోకి తీసుకొచ్చేలా ప్రత్యేక రైతు శాస్త్రవేత్తల కోర్సు ను ప్రారంభిస్తోందన్నారు. ఇలా శిక్షణ పూర్తయిన రైతు శాస్త్రవేతలను ఒక్కొక్క రైతు భరోసా కేంద్రానికి అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ సాగుబడిని మరింత విస్తృతం చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే..


జర్మనీ, భారత ప్రభుత్వాల సమన్వయంతో..  మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రోఏకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ (IGGAARL) సంస్థ ఈ అంశంలో ప్రధాన భూమిక పోషిస్తోందన్నారు. ఈ అకాడమీ రైతుల పరిశోధన, విజ్ఞానానికి ఓ వేదికగా మరడమే కాకుండా.. లాభదాయక ప్రకృతి వ్యవసాయ సాగు నమూనాల రూపకల్పన, పర్యవరణహిత ప్రకృతి వ్యవసాయంలో విధానపరమైన మార్పులు తీసుకరావటంతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వ్యాపింప చేసేందుకు ముఖ్య కేంద్రంగా పనిచేస్తుందన్నారు.


రైతు శాస్త్రవేత్త కోర్సు ద్వారా మన రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, ప్రతి రైతు భరోపా కేంద్రానికి ఓ రైతు శాస్త్రవేత్తను అందించి వారి ద్వారా ప్రతి గ్రామాన్ని ఓ ఎకో విలేజ్ గా మార్చాలన్నది గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం అన్నారు.


** రైతు సాధికారిక సంస్థ సీఈవో విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక రైతు శాస్త్రవేత్తను నియమించి అన్ని గ్రామాలను పర్యవరణ అనుకూలంగా తీర్చిదిద్దాలనే అంతిమ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వార రైతు శాస్త్రవేత్తలను తయారు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ప్రకృతి వ్యవసాయాన్ని చేరువ చేసే ప్రయత్నంలో రైతు శాస్త్రవేత్తలను కోర్సు ప్రధాన భూమిక పోషించనుందన్నారు. ఈ కోర్సు ద్వార రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.


మితిమీరిన పెట్టుబడుల, ఆశించిన దిగుబడులు రాకపోవడం, ఏక పంట పద్ధతులతో నేల నిస్సారం కావడం, వాతావరణం లో వస్తోన్న మార్పులు తదితర అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సంక్లిష్టంగా మారిన వ్యవసాయ జీవనోపాధులు చవిచూస్తున్న తరుణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సవాళ్లను అధిగమిస్తూ ఓ సరికొత్త వ్యవసాయ నాణ్యమైన ఆహార వ్యవస్థను సృష్టించవచ్చన్నారు. 


నాలుగేళ్ళ వ్యవధి కలిగిన ఈ ప్రత్యేక కోర్సు లో రైతు శాస్త్రవేత్త లకు నాలుగు విధాల శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం పై సంపూర్ణ అవగాహన కోసం తయారు చేసిన మాడ్యుల్స్ ను తరగతి గదుల్లో బోధించడం జరుగుతోందన్నారు. రైతు శాస్త్రవేత్తలు తమ సొంత పొలంలో "ఎ" గ్రేడ్ ప్రకృతి వ్యవసాయ నమూనాలు మరియు ATM (Any time money ) నమూనాలను తయారు చేయడం, వ్యవసాయ పాఠశాలలను నిర్వహించడం మరియు కమ్యూనిటీ శిక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. 


అంతేకాక రైతు శాస్త్రవేత్తలు ఆగ్రో ఎకాలజీకి సంబందించిన విభిన్న విషయాలను పరిశోధించి నేర్చుకోవడం ద్వార ప్రతి గ్రామాన్ని వాతావరణాన్ని తట్టుకొనే గ్రామంగా అభివృద్ధి చేయడం ఈ కోర్స్ యొక్క ప్రధాన లక్ష్యం కోర్సు పూర్తయ్యే నాటికి రైతు శాస్త్రవేత్త తన వ్యవసాయ క్షేత్రాన్ని ఉన్నత శ్రేణి గా తీర్చిదిద్ది ప్రతి నెల కనీసం ఎకరానికి 25 వేల రూపాయల ఆదాయం పొందేలా తయారవుతారు. అలాగే రైతు శాస్త్రవేత్త తీర్చిదిద్దిన ఆదర్శ నమూనా గ్రామంలోని మిగతా రైతులను ఆకర్షిస్తూ కనీసం 50 మందిని "ఎ " గ్రేడ్ రైతులుగా తీర్చిదిద్దగాలగాలి రైతు శాస్త్రవేత్త గ్రామాన్ని అంతటిని పర్యవరణహిత ప్రకృతి వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.


ఈ అకాడమీ ద్వారా...తొలి రెండేళ్లలో 1000 మంది రైతు శాస్త్రవేత్త లను తయారు చేసి ఆ తరువాత ప్రతి ఏటా రెండు నుంచి మూడువేల మంది రైతు శాస్త్రవేత్తలను తయారు చేయాలని రైతు సాధికార సంస్థ లక్ష్యంగా ఎంచుకుందన్నారు. అలాగే మూడో ఏడాది నుంచి ఇతర రాష్ట్రాలు మరియు దేశాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ అభ్యసకులకు కోర్సును ఆఫర్ చేయడం జరిగిందన్నారు. 


** ఒక్కరోజు జిల్లా పర్యటలో భాగంగా.. శనివారం ఉదయం పులివెందుల చేరుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. ముందుగా పులివెందుల ఆర్ అండ్ బి అతిధి గృహం చేరుకున్నారు. అక్కడ ఆయనకు పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప తదితరులు పుష్పగుచ్చలు అందజేసి అభినందనలు తెలియజేశారు. 


** అనంతరం ఐజిగార్ల్ కు సంబందించిన వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించి.. అక్కడ అభువృద్ది చేసే వంగడాలు, ఎరువులు, బయో న్యూట్రీయంట్స్ వాడకం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబందిత అధికారులు, రైతులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పరిశోధనా క్షేత్రంలో  సహజ సిద్ధంగా సాగుబడి చేసే సేద్యపు పనులను, కాడెద్దుల దుక్కులను కొబ్బరికాయ కొట్టి మంత్రి శుభారంభం చేశారు.


** అనంతరం ఐజి కార్ల్ ప్రాంగణంలో ఎపి మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా సూక్ష్మ సేద్యం, ఉద్యాన పంటల సాగునీటి సదుపాయం కోసం దరఖాస్తు చేసుకుని లబ్ది పొందిన రైతులకు సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా రెండు వేల హెక్టార్లకు పైగా సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక్కక్కరిగా లబ్దిదారులకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను పంపిణీ చేశారు.


** అనంతరం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభిస్తున్న రైతు శాస్త్రవేత్త కోర్సు (Farmers scientist course) కు సంబందించిన ఆకాడమిక్ వివరాలతో కూడిన పోస్టర్లను, అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబందించిన వివరాలను సంబందిత అధికారులు మంత్రికి వివరించారు.


** అక్కడే ఏర్పాటు చేస్తిన రైతు సాధికార సంస్థ పరిశోధనలకు సంబందించిన స్టాళ్లను మంత్రి పరిశీలించి.. అకడమిక్ మొదటి బ్యాచ్ కు చెందిన కాబోయే రైతు శాస్త్రవేత్తలను పరిచయం చేసుకుని.. వారి ఆశక్తులను ఆడిగి తెలుసుకున్నారు.


** రామ్మోహన్, రజిని, ఉష తదితరులు ఫార్మర్ సైటిస్టు కోర్సు విద్యార్థులుగా, లక్ష్మీ, యశోద, మహేష్, అఖిల తదితరులు మెంటర్లుగా.. వ్యవసాయ మంత్రి నుండి ఐడి కార్డులను అందుకున్నారు. 


** *జర్మన్ శాస్త్రవేత్తల ప్రసంశలు..*


** అనంతరం రైతు సాధికార సంస్థ ద్వారా.. పరిశోధనలు చేసే రైతులకు.. నాలెడ్జ్ ఇన్ఫ్రస్ట్రక్టర్ ను ప్రొవైడ్ చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తామని, ప్రకృతి వ్యవసాయ సాగుబడిలో వినూత్న అభివృద్ధికి శుభారంభం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని.. మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రకృతి వ్యవసాయ అకాడమీ ప్రపంచానికే మార్గదర్శం అని అభినందించారు. అంతేకాకుండా.. ప్రకృతి వ్యవసాయ.పరిశోధనాభివృద్ది ద్వారా..  ఇండో జర్మన్ దేశాల మధ్య వ్యవసాయ, ఆర్థిక లావాదేవీలు, సంబంధాలు మెరుగు పడగలవని.. జెర్మన్ దేశం నుండి వ్యవసాయ శాస్త్రవేత్తలు వర్చువల్ విధానం ద్వారా IGGCAARL ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యి.. వారి మనోభావాన్ని తెలియజేసారు.


ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, ఎడి అశోక్ రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు, సీనియర్ ప్రాజెక్టు మేనేజర్లు, మెంటార్లు, కోర్సులో జాయి అయిన రైతులు, వ్య స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ** *పలువురు మెంటార్ల అభిప్రాయాలు..*


** *ఆరోగ్యకరమైన దిగుబడుల ఉత్పత్తులు సాధించడమే.. లక్ష్యం..*


అందుకోవాలన్న ఆలోచనతో సాధారణ డిగ్రీ చదివిన నేను కొంత కాలంగా.. వ్యవసాయ శాఖ అనుబంధంగా మహిళా రైతులకు పలు శిక్షణా తరగతులను నిర్వహించేదాన్ని, రిసోర్స్ పర్సన్ గా ఇప్పటికే ఎంతో మందికి వ్యవసాయంలో మెలకువలు తెలియజేశాను.  సొంత పొలంలోనే ప్రకృతి వ్యవసాయం సాగుబడి చేపట్టి.. అధిక లాభాలు పొందడమే కాకుండా.. నా జిల్లాతో పాటు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ.. సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంట దిగుబడులను అందుకోవాలన్న ఆలోచనతో.. ఇక్కడ చేరాను. రైతు సాధికార సంస్థ ద్వారా.. నా ద్వారా కొంతమంది యువ రైతులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం లభించడం నా అదృష్టం. 


- నీలావతి, మెంటార్, లింగాల మండలం. వైఎస్ఆర్ జిల్లా.** *ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామ్యం కావడం అదృష్టం..*


సీఆర్పీ గా పని చేస్తున్నాను. గతంలో పీఆర్పీగా చేసేదాన్ని నా గత అనుభవంతో.. ఇక్కడ నేను మెంటార్ గా స్థానం సమ్పదించడం జరిగింది. ముందు నేను నా సొంత పొలంలో ప్రకృతి విధానంలో పంటల సాగుకు శ్రీకారం చుట్టాను. నేను అవగాహన పొందడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశ పెట్టిన రైతు శాస్త్రవేత్త కోర్సు ద్వారా ఎంతో మంది యువ రైతు శాస్త్రవేత్తలను తయారు చేయడం, వారి ద్వారా మరికొంత మెంటార్లను తర్యరూ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.


- ఎస్.రత్న కుమారి, మెంటార్, తూర్పు గోదావరి జిల్లా.


* *రైతులు నెలకు 25- 30 వేలు అధిక లాభాలు గడించాలి..*


డిగ్రీ చదివాక వ్యవసాయం మీద మొగ్గుతో 15 ఏళ్లుగా వ్యవసాయ సాగు చేస్తూ.. పలు రైతు సంఖ్యలో సీఆర్పీలు గా.. పని చేస్తూ అరా అనుభవం ఉన్న నా లాంటి వారిని మెంటర్లుగా ఎంపిక చేయడం జరిగింది. నేచురల్ ఫార్మింగ్ ద్వారా నెలకు 25- 30 వేలు అధిక లాభాలు గడించేలా రైతులను తీర్చిదిద్దడమే.. మా లక్ష్యం. నాలుగేళ్లలో.. పూర్తిస్థాయిలో నిష్ణాతులైన రైతు శాస్త్రవేత్తలను.. గ్రామీణ స్థాయిలో ఆర్బికెల్లో శాస్త్రవేత్తలుగా అయింట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాలు అందించిన రైతు సాధికార సంస్థకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు.


- రామ్మోహన్ రెడీ, మెంటార్, సత్యసాయి జిల్లా.Comments