డోకిపర్రు ఎన్టీఆర్ కాలనీని జలదిగ్బంధం నుండి కాపాడిన వెనిగండ్ల.

 *డోకిపర్రు ఎన్టీఆర్ కాలనీని జలదిగ్బంధం నుండి కాపాడిన వెనిగండ్ల*


 *- కుండపోత వర్షాలకు కాలనీని చుట్టుముట్టిన వరదనీరు*

 *- కాలనీవాసులతో కలిసి వరదనీటిలో పర్యటించిన వెనిగండ్ల* 

 *- వెనిగండ్లకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్ కాలనీవాసులు* గుడివాడ, జూలై 27 (ప్రజా అమరావతి): గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు ఎన్టీఆర్ కాలనీని జలదిగ్బంధం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము కాపాడడంపై ఆ కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వరద నీరంతా ఎన్టీఆర్ కాలనీని చుట్టుముట్టింది. కాలనీవాసులంతా కనీసం బయటకు రాలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఇళ్ళ చుట్టూ మోకాలి లోతు నీరు చేరిపోయింది. రోడ్లు ఎక్కడున్నాయో కూడా కన్పించని పరిస్థితి ఏర్పడింది. అంతకంతకు వరదనీరు పెరుగుతూ ఉండడంతో కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో కాలనీలో వరదనీటి సమస్యను తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన వెనిగండ్ల కుండపోత వర్షంలోనూ కాలనీలో పర్యటించారు. వరదనీరు భారీగా కాలనీని ముంచెత్తడాన్ని కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. వరదనీటి సమస్యను పరిష్కరించడంపై వెనిగండ్ల దృష్టి పెట్టారు. ప్రొక్లయిన్ ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కచ్చా డ్రైన్లను తవ్విస్తూ వరదనీరు పూర్తిగా పరిసర ప్రాంతాల్లోని కాల్వల్లోకి చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో రోడ్లపైనే నిలిచిపోయిన నీరంతా బయటకు తరలిపోయింది. కాలనీలో ఇళ్ళ చుట్టూ ఉన్న వరదనీటిని కూడా తొలగింపజేశారు. దీంతో వరద నీటి సమస్య నుండి బయటపడిన  డోకిపర్రు ఎన్టీఆర్ కాలనీ వాసులంతా వెనిగండ్లకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

Comments