ఎస్సీ ఎస్టీలు బలహీనవర్గాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలను ఉదారంగా అందించి వారి అభ్యున్నతికి తోడ్పడాలి.

 


మచిలీపట్నం జూలై 12 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల కింద ఎస్సీ ఎస్టీలు బలహీనవర్గాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలను  ఉదారంగా అందించి వారి అభ్యున్నతికి తోడ్పడాల


ని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు.


బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనాభాలో 25 శాతం మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు.

ఈ పథకాల కింద  లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి  పురోగతికి తోడ్పడాలన్నారు.

తద్వారా రాష్ట్ర జాతీయ స్థూల ఆదాయ ఉత్పత్తి (జి.డి.పి) పెరుగుతుందన్నారు.


ముఖ్యంగా జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా  పీఎంఈజీపి పథకం కింద పరిశ్రమలు నెలకొల్పేందుకు 82 దరఖాస్తులు ఇంకను బ్యాంకుల్లో పెండింగ్లో ఉండడం సరైంది కాదన్నారు.

వారికి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం లేకున్నప్పటికీ అది కావాలని కోరడం సమంజసం కాదని అట్టడుగున ఉన్న ప్రజలను పైకి తీసుకురావాలన్నదే బ్యాంకుల ప్రధాన బాధ్యతని గుర్తు చేస్తూ వెంటనే ఈ విషయమే ప్రత్యేక దృష్టి సారించి వారందరికీ బ్యాంకు రుణాలు అందించాలని సూచించారు.


వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి చాలా ముఖ్యమైనదని ఈ పథకం కింద సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పుటలో కొంత నిర్లక్ష్యం కనబడుతోందని ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అటువంటి యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన బ్యాంకు రుణాలు అందించి రైతులను ఆదుకోవాలన్నారు.


అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న టిడ్కో గృహాలు పేదలందరికీ ఇళ్లు సంబంధించిన లబ్ధిదారులకు సిబిల్ రేట్లు చూడకుండా వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని వారికి 50 వేల నుంచి లక్ష రూపాయల దాకా బ్యాంకు రుణాలు అందించి గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు సహాయపడాలన్నారు. తర్వాత వారి ఇంటిని కొల్లేటరల్ సెక్యూరిటీ కింద తీసుకొని వారు ఇల్లు పొందే అవకాశం కల్పించాలన్నారు.

అట్టడుగు వర్గాల ప్రజలందరికీ బ్యాంకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు.

మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు.


మత్స్య సంపదకు నిలవైన  మచిలీపట్నంలో మత్స్యకారులకు  గత సంవత్సరం సరిగా రుణాలు అందించలేదని ఈ సంవత్సరం అయినా మరిన్ని రుణాలు అందించి వారు ఆర్థిక పరిపుష్టి సాధించేలాగా తోడ్పడాలన్నారు..

మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని దానికి అనుబంధంగా పలు ఆధారిత పరిశ్రమలు రానున్నాయని ఈ అంశాలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి బ్యాంకు రుణాలను ఉదారంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

జిల్లా పరిపాలన యంత్రాంగం బ్యాంకుల బలోపేతానికి  అన్ని విధాల సహకారం అందిస్తుందన్నారు


గత ఆర్థిక సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలను మించి పురోగతి సాధించినందుకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా బ్యాంకర్లను అభినందించారు.


సిసిఆర్సి గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకు  ఇబ్బంది కలిగించకుండా పంట రుణాలు అందించాలని ఒకవేళ భూ యజమాని ఇదివరకే పొంది ఉంటే ఆ విషయం వ్రాతమూలకంగా తెలియజేయాలని సూచించారు.


 పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ ఎస్టీల కోసం కేవలం ఐదు యూనిట్ల పరిశ్రమలు నెలకొల్పేందుకు మాత్రమే బ్యాంకు రుణాలు అందించడం బాధాకరమైన  విషయమన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి చేయూత వంటి  పలు పథకాల కార్యకలాపాలన్నీ బ్యాంకుల ద్వారానే  జరుపుతుందన్నారు.  కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండానే వారికి రుణాల అందించాలన్నారు

కౌలు రైతులకు రుణాల అందించి వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిసిఆర్సి కార్డుల పంపిణీ చేపట్టిందన్నారు. వారికి తప్పనిసరిగా రుణాలు అందించేలా బ్యాంకర్లు సహకరించాలన్నారు

గ్రామాల్లో పేద ప్రజలకు ముద్రా రుణాలు ఇవ్వడం లేదని వాటిని విరివిగా అందించి వారి జీవనోపాదులకు తోడ్పడాలన్నారు. వైయస్సార్ జగనన్న గృహ నిర్మాణ కార్యక్రమంలో కూడా బ్యాంకర్లు భాగస్వాములై ఆర్థిక సహాయం అందించి తమ వంతు సహకారం అందించాలన్నారు. ఆ ఇల్లు పూర్తి అయితే పది లక్షల ఆస్తి లబ్ధిదారులకు లభిస్తుందన్నారు.

సిఎస్సార్ నిధులను బ్యాంకులు ఉన్న ప్రాంతాల్లోనే అక్కడి అవసరాలకు ఖర్చు పెడితే అక్కడి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఆర్బిఐ ఏజీఎం ఎంజెడ్ రెహమాన్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా బ్యాంకర్లు లక్ష్యసాధనను అధిగమించినందులకు అభినందించారు.

పేద ప్రజల పట్ల సానుకూలంగా స్పందించి బ్యాంకు రుణాల అందించాలన్నారు.

క్షేత్రస్థాయిలో బ్యాంకర్లను రుణాల మంజూరు విషయమై వస్తున్న సూచనలను తెలియజేసి వారిని చైతన్యపరచాలన్నారు.జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ టి.ఎస్. జయవర్ధన్ మాట్లాడుతూ 2022- 23 ఆర్థిక సంవత్సరంలో జిల్లా సాధించిన ప్రగతి వివరాలను తెలియజేశారు. జిల్లాలో మొత్తం డిపాజిట్లు 20వేల 790 కోట్లు రూపాయలు కాగా 37,447 కోట్ల రూపాయలు అడ్వాన్సు కింద మరో 17012 కోట్ల రూపాయలు ప్రాధాన్యత రంగాలకు అడ్వాన్సుల కింద మంజూరు చేయడం జరిగిందన్నారు.

ఇందులో వ్యవసాయ రంగానికి 10,532 కోట్ల రూపాయలు, ఎంఎస్.యం.యి.కి 44 75 కోట్ల రూపాయలు, గృహ రుణాల కోసం 1226 కోట్ల రూపాయలు, ఎస్ హెచ్ జి రుణాలు 3259 కోట్ల రూపాయలు, బలహీన వర్గాలకు  రుణాలు  9605 కోట్ల రూపాయలు ,మహిళల కోసం 5489 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు.


 ఈ సమావేశంలో ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ,సప్తగిరి బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ శివరాం ప్రసాదు, డి ఆర్ డి ఎ పి డి పిఎస్ఆర్ ప్రసాద్ జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి జడ్పిసిఇ ఓ జ్యోతిబసు జిల్లా పరిశ్రమల అధికారి వెంకట్రావు పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారుComments