*ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు*
పార్వతీపురం(సాలూరు), జూలై 7 (ప్రజా అమరావతి): గాంధీ మహాత్ముడు కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు అవసరమైన సేవలు అన్నింటినీ ఇంటివద్దనే అందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమశాఖమంత్రి పీడికరాజన్న దొర తెలిపారు. శుక్రవారం సాలూరు పట్టణం నాయుడువీధి మరియు నెయ్యిలవీధిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొని లబ్ధిదారులకు ధృవపత్రాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో డబ్బది శాతం జనాభా పల్లెలలోనే నివశిస్తున్నారని, వారి చెంతకే పరిపాలన అందించాలని సచివాలయవ్యవస్థను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని, ఇప్పుడు ప్రజల సమస్యలను గుర్తించి వారికి అవసరమైన సేవలను నేరుగా ప్రజల వద్దకు అందించుటకు జగనన్న సురక్ష పధకాన్ని ప్రవేశపెట్టారని ఉపముఖ్యమంత్రి తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు జగనన్న సురక్ష పథకం ద్వారా సేవలను ప్రతి ఒక్కరికి అందించాలని, ప్రతి ఇంటికి వెళ్లి వారి అవసరాలను తెలుసుకోవాలన్నారు. ఏ ఇంటిని కూడా విడిచి పెట్టకుండా, ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం సర్వే చేయాలన్నారు. అవసరమైన ధ్రువపత్రాలు లేకపోవడం వలన ప్రభుత్వ పథకాలకు అర్హులైన ఎవరికైనా పథకాలు అందకపోతే వారికి ధ్రువపత్రాలను జారీ చేసి, పథకాలను అందించాలని తెలిపారు. జగనన్న సురక్ష పథకం ద్వారా మంజూరు చేసిన ధ్రువపత్రాలను ఉపముఖ్యమంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ , రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment