సోమవారం ప్రజాఫిర్యాదుల స్వీకరణ "స్పందన" కార్యక్రమం.

 సోమవారం ప్రజాఫిర్యాదుల స్వీకరణ "స్పందన" కార్యక్రమం*


పుట్టపర్తి   కలెక్టరేట్లో  స్పందన హాలు నందు జిల్లాస్థాయి స్పందన కార్యక్రమం నిర్వహణ*


జిల్లా కలెక్టర్  అరుణ్  బాబుపుట్టపర్తి ,  జూలై 16 (ప్రజా అమరావతి):


*ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకోసం  జూలై నెల 17వతేదీన   సోమ వారం "స్పందన" గ్రీవెన్స్ కార్యక్రనాన్ని యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  అరుణ్ బాబు  ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా చేపడుతున్నట్లు తెలిపారు.*

*పుట్టపర్తి కలెక్టరేట్లో  స్పందన  హాలు నందు  జిల్లా స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తారు. జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం జిల్లా కేంద్రంలోని పుట్టపర్తి  కలెక్టరేట్లో  స్పందన హాలు నందు ఉదయం 9.30 గంటలనుండి స్పందనకార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు వారి వారి సమస్యలను వినతులు రూపంలో అందజేయాలని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీ, ఆధార్ కార్డ్ నకలు మరియు ఫోన్ నెంబర్ అందజేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలన్నారు. పై ప్రకటనలో తెలిపారు. సోమవారం  స్పందన కార్యక్రమం  నిర్వహించుచున్నట్లు  కలెక్టర్ పై ప్రకటనలో తెలిపారుComments