రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి నితిష్ గడ్కరీకి ఘనస్వాగతం.



*రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న  కేంద్ర మంత్రి నితిష్ గడ్కరీకి ఘనస్వాగతం


*


తిరుపతి, జూలై 12 (ప్రజా అమరావతి): గౌరవ రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల కేంద్ర మంత్రి తిరుపతి జిల్లాలో ఈ నెల జూలై 12 మరియు13 తేదీలలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నేటి బుధవారం సాయంత్రం 4.55 గం. లకు  రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి వారికి ఘన స్వాగతం లభించింది.


రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తిరుపతి నగరపాలక మేయర్ శిరీష, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, ఆం.ప్ర రోడ్లు భవనాలు శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జెసి డి కె బాలాజీ, నగరపాలక కమిషనర్ హరిత, శ్రీ కాళహస్తి  ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఎన్హేచ్ఏఐ ఆర్. ఓ, విజయవాడ రాకేష్ కుమార్ సింగ్, చిత్తూరు పిడి కార్తిక్, ఆర్డీవో   రామారావు, పలువురు బిజెపి ప్రతినిధులు తదితరులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.


అనంతరం విమానాశ్రయం నుండి రేణిగుంట మండలం కొత్తపాలెం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు బయల్దేరి వెళ్లారు.


Comments