సురక్షా కాంపెయిన్ లో ధ్రువ పత్రాలను వెంట వెంటనే జారీ చేయాలి.


  సురక్షా కాంపెయిన్ లో ధ్రువ పత్రాలను  వెంట వెంటనే జారీ చేయాలి నగరంలో 1,2 ,3 ,4 సచివాలయాలలో జగనన్న సురక్ష కాంపెయిన్ కు హాజరైన కలెక్టర్ నాగలక్ష్మి


విజయనగరం, జులై 01:(ప్రజా అమరావతి): జగనన్న సురక్షా కార్యక్రమంలో  సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంట వెంటనే ధ్రువ పత్రాలను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కాంపెయిన్ రోజున, లేదా ఇంకా ముందే వారి దరఖాస్తులను పరిష్కరించాలని, క్యాంపు తర్వాత ఏదీ కూడా పెండింగ్ ఉండకూడదని అన్నారు. శనివారం కలెక్టర్ నగరంలోని 1,2,3,4 సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న సురక్ష కాంపెయిన్ లకు హాజరైనారు. కాంపెయిన్ ఎలా నిర్వహిస్తున్నది, ఎన్నెన్ని టోకెన్లు జారీ అయినది వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని  ఆరా తీశారు.  మహిళలతో మాట్లాడుతూ ఈ క్యాంపెయిన్ లో ఏ ఏ సేవలు పొందుతున్నారు, వాలంటీర్లు ఇంటికి వచ్చారా అని ప్రశ్నించారు. మహిళలంతా వారు పొందుతున్న సేవల గురించి కలెక్టర్ కు వివరించారు. ఇదివరకు ఆలస్యంగా అందేవని, ఈ కాంప్ ద్వారా వెంటనే ధ్రువ పత్రాలు అందుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎండ ఎక్కువగా ఉన్నందున త్వరగా వారి పనులను పూర్తి చేసి పంపేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం మీడియా తో కలెక్టర్ మాట్లాడుతూ ఈ కాంప్ ద్వారా  ఇంతవరకూ   52 వేల సేవలకు ఆన్లైన్ లో దరఖాస్తులు నమోదు అయ్యాయని తెలిపారు. ఎక్కువగా కాస్ట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఆధార్ అప్డేషన్ కోసం  దరఖాస్తులు వస్తున్నాయని, 11 రకాల సేవలను వేగంగా అందించడం జరుగుతోందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ముచ్చు లయ యాదవ్, కమిషనర్ శ్రీరాములు నాయుడు, కార్పొరేటర్లు ఆనంద్, అల్లు చాణుక్య, రాజేష్, సత్యగౌరి, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు  పలు ధ్రువ పత్రాలను అందజేశారు.

Comments