రొట్టెల పండుగ సందర్భంగా బారాషహీద్ దర్గాకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలి.


నెల్లూరు (ప్రజా అమరావతి);

.

రొట్టెల పండుగ సందర్భంగా  బారాషహీద్ దర్గాకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాల


ని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, అధికారులను ఆదేశించారు. 


సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్  ఎం హరినారాయణన్, ఎస్పీ  తిరుమలేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్  వికాస్ మర్మత్ లతో కలిసి  సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై  ఈనెల 29వ తేదీ నుండి    నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో  జరగనున్న  రొట్టెల పండగ  సందర్భంగా చేపట్టాల్సిన ముందస్తు  ఏర్పాట్ల పై  శాఖల వారీగా సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది.  


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ మాట్లాడుతూ,   రొట్టెల పండుగ ఏర్పాట్లు కు సంబంధించి ఏ శాఖకు  కేటాయించిన విధులను  ఆ శాఖ  భాద్యతతో, నిబద్దతతో  విధులను నిర్వర్తించి ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. దేశం నలుమూలల  నుండి ఈ రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖతో  సమన్వయం చేసుకొని  నెల్లూరు నగరంలో  ఆయా  రూట్లు వారిగా   ఆర్.టి సి బస్సులు నడిచేలా   చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఆర్టిసి ఆర్ఎం ను ఆదేశించారు. దర్గా ప్రాంతంలో  పారిశుధ్యం ఏర్పాట్లు,  పటిష్టంగా చేపట్టడంతో పాటు   విచ్చేసే భక్తులకు  తాగునీటి సౌకర్యం ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీరు లభించే ప్రదేశంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న దృష్ట్యా, రాత్రి వేళల్లో  లైటింగ్ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు. స్వర్ణాల చెరువు ఘాట్ ల వద్ద బారికేడ్లు, అవసరం మేరకు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు. రెస్క్యూ టీమ్ లను కూడా ఏర్పాటు  చేయాలన్నారు. దర్గా ప్రాంతంలో,  నెల్లూరు నగరంలో పండుగ రోజుల్లో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ అధికారులకు సూచించారు. పార్కింగ్ ప్రదేశాల్లో కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లుతో పాటు బంధోబస్తు ఏర్పాట్లు   చేపట్టాలని  అధికారులను ఆదేశించారు. అవసరమైన వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి 104,108 వాహనాలతో పాటు డాక్టర్లు  అందుబాటులో  ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. స్వర్ణాల చెరువులో నీరు సమృద్ధిగా ఉండేట్లు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు  సూచించారు. అవసరమైన బోట్లు ను, ఈతగాళ్ళ ను సిద్ధంగా ఉంచాలని మత్స్య శాఖ అధికారులకు సూచించారు.  నగరానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా దర్గాకు వచ్చేలా భక్తులకు తెలిసేలా  రూట్ మ్యాప్ లను పార్కింగ్ ప్రదేశాల్లో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మునిసిపల్ అధికారులను ఆదేశించారు.  రొట్టెల పండుగ జరుగు రోజుల్లో  దర్గా పరిసర ప్రాంతాల  ప్రజలు ఇబ్బంది పడకుండా   సంబంధిత సచివాలయాల ద్వారా పాసులు జారీ చేయాలని,  ఈ ఏర్పాట్లను  సీనియర్ అధికారి పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమీషనర్ కు సూచించారు.  పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ అధికారులు  ప్రత్యేక శ్రద్ద తీసుకొని   చేపట్టాల్సిన ముందస్తు చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని  పోలీస్ అధికారులకు సూచించారు. రెస్క్యూ టీమ్ లను కూడా ఏర్పాటు  చేయాలన్నారు. వివిధ ప్రాంతాల నుండి  రొట్టెల పండుగ నిమిత్తం వచ్చే భక్త్తుల కోసం నగరంలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రదేశాల వివరాలు ప్రజలకు తెలిసేలా  చర్యలు తీసుకోవాలని పోలీసు, పురపాలక శాఖ అధికారులకు సూచించారు.


జిల్లా ఎస్.పి శ్రీ తిరుమలేశ్వర రెడ్డి మాట్లాడుతూ,   రొట్టెల పండుగ సందర్బంగా  దర్గా ప్రాంతంలోనూ, పార్కింగ్ ప్రదేశాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా  శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా  సంబంధిత శాఖల సమన్వయంతో   గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పక్కాగా చేపడుతున్నట్లు తెలిపారు.  ముఖ్యంగా  దర్గా ప్రాంతంలో  భక్తులకు, విఐపి లకు దర్శనానికి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. స్వర్ణాల ఘాట్ వద్ద, క్యూలైన్ల వద్ద బారికేడ్లు ఏర్పాటతో పాటు  ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యేలా దర్గా ప్రాంగణంలో   సైన్   బోర్డులు, మ్యాపులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 


ఈ సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, అడిషనల్ ఎస్పీ హిమవతి, ఆర్డిఓ మలోల, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా దేవి,  సంబంధిత శాఖల  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Comments