గుడివాడలో “మన వెనిగండ్ల”కిప్పుడు మహిళల వంతు వచ్చేసింది.

 *- గుడివాడలో “మన వెనిగండ్ల”కిప్పుడు మహిళల వంతు వచ్చేసింది*


 *- నిరుద్యోగ యువతకైతే ఉద్యోగాలిప్పిస్తూనే వస్తున్నారు* 

 *- మహిళలకు కూడా పని కల్పించడమే పనిగా పెట్టుకున్నారు* 

 *- ఇక ఐదు వేల కుటుంబాల కోసం స్త్రీ శక్తిని ప్రారంభించేశారు* 

 *- గుడ్ మెన్ పేటను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకున్నారు* 

 *- కుట్టు శిక్షణతో పాటు స్వయం ఉపాధి కల్పనకూ చర్యలు* 

 *- ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోనివ్వని ప్రణాళిక* 

 *- నివాసమున్న చోటే పని కల్పించాలన్నది వెనిగండ్ల లక్ష్యం* 

 *- టీడీపీ అధికారంలోకి వచ్చేలోగా గుడివాడలో స్త్రీ శక్తితో వెనిగండ్ల* 


గుడివాడ, జూలై 3 (ప్రజా అమరావతి): మన గుడివాడ - మన వెనిగండ్ల నినాదంతో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో సేవా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ వస్తున్న టీడీపీ నాయకులు వెనిగండ్ల రాముకు ఇప్పుడు మహిళల వంతు వచ్చేసినట్టుంది. తాను పుట్టి పెరిగిన గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో గత ఏడాది వెనిగండ్ల ఫౌండేషన్ ను నెలకొల్పారు. నారా లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకుని నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీల్లో దాదాపు 2వేలకు పైగా ఉద్యోగాలిప్పించారు. రాజమహేంద్రవరం మహానాడులో తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకుని మహాశక్తి, యువశక్తి పథకాలను చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పథకాలను అమలు చేస్తామంటూ ప్రజల్లోకి వెళ్ళిన వెనిగండ్ల, ఆలోగా తన సేవాకార్యక్రమాలకు కొనసాగింపుగా గుడివాడలో స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలందరికీ పని కల్పించడమే తన పనిగా వెనిగండ్ల పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గంలోని దాదాపు 5 వేల మంది మహిళల కుటుంబాల కోసం స్త్రీ శక్తి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. మొదటగా గుడ్ మెన్ పేటను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకున్నారు. ఇక్కడ మహిళలకు కుట్టు శిక్షణతో పాటు స్వయం ఉపాధిని కూడా కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోనివ్వని ప్రణాళికతో స్త్రీ శక్తి కార్యక్రమాన్ని వెనిగండ్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేయడంతో పాటు నివాసమున్న చోటే పని కల్పించేలా వెనిగండ్ల తన లక్ష్యానికి కార్యరూపం ఇస్తున్నట్టుగా కన్పిస్తోంది. గుడివాడ పట్టణం గుడ్ మెన్ పేటలో వెనిగండ్ల మొదటగా ప్రారంభించిన స్త్రీ శక్తి కార్యక్రమానికి నియోజకవర్గంలోని మహిళల నుండి అనూహ్య స్పందనే వస్తోంది. ఇక్కడ కుట్టు శిక్షణ, ఉపాధి కల్పన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చే దిశగా ప్రణాళికబద్దంగా ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని మరిన్ని ప్రాంతాల్లో స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా స్త్రీ శక్తి కార్యక్రమానికి సంబంధించి వెనిగండ్ల మాట్లాడుతూ మహిళలకు కుట్టుశిక్షణ ఇవ్వడంతో పాటు వారిని అన్నిరకాలుగా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో స్త్రీ శక్తి వంటి మరిన్ని ప్రాజెక్ట్ లను గుడివాడ నియోజకవర్గానికి తీసుకురావడం జరుగుతుందని వెనిగండ్ల చెప్పారు.

Comments