ఎన్కాస్ సర్టిఫికెట్ పొందిన తొలి "యూపీహెచ్సీ"...


 *ఎన్కాస్ సర్టిఫికెట్ పొందిన తొలి "యూపీహెచ్సీ"...*

  మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి గణపతి నగర్ డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ రాష్ట్రంలో తొలి యూపీహెచ్సీగా నేషనల్ క్వాలిటీ ఎస్సూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్కాస్) సర్టిఫికెట్ పొందింది. ఈ మేరకు భారత ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ విశాల్ చౌహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 19, 20 తేదీలలో ఢిల్లీ ఎన్కాస్ టీం హెల్త్ సెంటర్ ను సందర్శించి హెల్త్ సెంటర్లోని 12 రకాల వైద్య ఆరోగ్య సౌకర్యాలను పరిశీలించింది. 12 రకాల వైద్య ఆరోగ్య సౌకర్యాలలో 100 మార్కులకు గాను 96.2 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఫుల్ సర్టిఫైడ్ పొందింది. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి అర్బన్ హెల్త్ సెంటర్ గా ఎన్కాస్ సర్టిఫికెట్ పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) సహాయ సహకారాలతో, వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయలక్ష్మి, డిఎంహెచ్వో డాక్టర్ శ్రావణ్ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సూచనలు, సలహాలతో సర్టిఫికెట్ సాధించగలిగామని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేకు, వైద్య శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. హెల్త్ సెంటర్లో భవిష్యత్తులో కూడా నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూనే, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు.


Comments