వృద్ధ అక్కా చెల్లెళ్ల హత్య కేసును చేదించిన పోలీసులు.

 *వృద్ధ అక్కా చెల్లెళ్ల హత్య కేసును  చేదించిన పోలీసులు


*
నిజామాబాద్ జిల్లా:జులై 22 (ప్రజా అమరావతి);

ఆర్మూర్ లో నాలుగు రోజుల క్రితం ఆర్మూర్ టౌన్ లోని సంతోష్ నగర్ లో వృద్ద అక్కాచెల్లెల్లు మగ్గిడి రాజవ్వ, మగ్గిడి గంగవ్వల హత్య కేసును పోలీసులు 48 గంటల్లో చేదించారు. నిందితున్ని అరెస్టు చేసి ఆయన వద్ద పది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఇంచార్జి సీపీ ప్రవీణ్ తెలిపారు.

   

శనివారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. గంగవ్వ కొడుక్కి తమ కూతురిని ఇచ్చి పెళ్ళి చేసిన వియ్యంకుడు చేపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అలియాస్ ముత్తన్ననే ఈ హత్యలు చేసినట్లు వెల్లడించారు. వారిద్దరిపై ఉన్న బంగారం చోరీ చేసే ప్లాన్ తో చుట్టరికంతో వారి ఇంటికి వచ్చి రాత్రికి పడుకుని తెల్లవారుజామున ఇద్దరిని రోకలిదుడ్డుతో కొట్టి వారి ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని అగ్నిప్రమాదంగా సీన్ క్రీయేట్ చేసి పారిపోయాడని తెలిపారు. సమీపంలోని విద్యహైస్కూల్ కు చెందిన సీసీ కెమెరాలో నిందితుడు తెల్లవారుజామున తిరిగిన దృశ్యాలు రికార్డు కావడంతో నిందితున్ని పట్టుకోవడం సుసాధ్యమైందని సీపీ తెలిపారు....

Comments