ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మార్చేశారు.

 *ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మార్చేశారు*


             

 *రైతుబాంధవుడు చంద్రన్న...యమకింకరుడు జగన్*

     

*రూ.వేల కోట్ల ఆస్తులను అమూల్‌కు అప్పగిస్తున్నారు*


*విద్యుత్‌ ఛార్జీలు తగ్గించే బాధ్యత తీసుకుంటాం*


*టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌*


మాలెపాడులో పాడిరైతులతో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.


ఒంగోలు (ప్రజా అమరావతి) : అధికారంలోకి వచ్చిన తర్వాత మూసేసిన డెయిరీని మళ్లీ తెరుస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మాలెపాడు పాడి రైతులతో మాట్లాడారు. రూ.వేల కోట్ల విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ డెయిరీకి కట్టబెడుతోందని టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు.  దామచర్ల జనార్దన్ , కొండెపి ఎమ్మెల్యే డోలా వాలా వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో   యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం  ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాలెపాడులో పాడి రైతులతో మాట్లాడారు. టీడీపీ  అధికారంలోకి వచ్చాక మూసేసిన డెయిరీలను మళ్లీ తెరుస్తామన్నారు. రాయితీలు లేకుండా వ్యవసాయం లాభసాటిగా ఉండదని, పాడి రైతులు బాగుపడాలంటే తొలగించిన రాయితీలను వెనక్కి తేవాలని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యానరంగం, పట్టు పరిశ్రమలను టీడీపీ ప్రోత్సహించిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారన్నారు.  టీడీపీ  అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు తగ్గించే బాధ్యత తీసుకుంటాం. మోటార్లకు మీటర్లు బిగిస్తే తొలుత రాయితీలు ఇచ్చి తర్వాత తొలగిస్తారు. పెట్టుబడి ధరలు పెరిగి గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి రాష్ట్రంలో ఉందని లోకేశ్‌ అన్నారు.


రైతుబాంధవుడు చంద్రన్న...యమకింకరుడు జగన్ : ఇవి గత టిడిపి ప్రభుత్వంలో అన్నదాతలకు ఇచ్చిన రైతురథాలు. యువగళం పాదయాత్ర సందర్భంగా మాలేపాడు శివార్లలో నాకు తారసపడ్డాయి. ఒక్క కొండపి నియోజకవర్గంలోనే 150 ట్రాక్టర్లు అందజేశాం. రైతును రాజుగా నిలపాలన్న లక్ష్యంతో చంద్రబాబు గారు పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని సైకో ప్రభుత్వం అన్నదాతలను ఉరికంభమెక్కిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలో వైసిపి సర్కారు వేధింపులు తాళలేక ఎండిఓ కార్యాలయంలోనే గోవిందప్ప అనే రైతన్న ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య  చేసుకున్నాడు. ఎవరు రైతు బాంధవుడు? ఎవరు రైతుల పాలిట యమకింకరుడు అని నారా లోకేష్ ప్రశ్నించారు.


లోకేష్ ను కలిసిన మూలెవారిపాలెం గ్రామస్తులు : కొండపి నియోజకవర్గం మూలెవారిపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో అత్యధికులు టిడిపి సానుభూతిపరులన్న కక్షతో అభివృద్ధి కార్యక్రమాలు ఆపేశారు. మా గ్రామంలో రోడ్డు పనులు సగంలో నిలిపేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన సమయంలో మాకు స్థలాలు ఇవ్వలేదు. మా గ్రామంలో 60 కుటుంబాలున్నాయి, నీటి సదుపాయం లేదు. మా గ్రామం పక్కన వాగు ఉంది. దీనిపై చెక్ డ్యామ్ నిర్మించాలి. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నారా లోకేష్ స్పందిస్తూ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాదిరిగా మార్చేశారన్నారు.  సెంటుపట్టా పేరుతో 7వేల కోట్లు దోచుకున్న జగన్ అండ్ కో తమ వారికి మాత్రమే పట్టాలు ఇచ్చుకున్నారని, సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం చూడమని ముఖ్యమంత్రి కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మూలెవారిపాలెంలో పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం. ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 నీరు సరఫరా అయ్యేలా చూస్తాం. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.


లోకేష్ ను కలిసిన పొన్నలూరు మండల పాస్టర్లు : కొండపి నియోజకవర్గం తిమ్మపాలెం వాటర్ ట్యాంక్ వద్ద పొన్నలూరు మండల పాస్టర్లు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా మండలంలోని పాస్టర్లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి. ప్రార్థనా మందిరాలకు ప్రహరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. మా సమస్యలపై వైసీపీ ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పాస్టర్లకు రూ.10వేలు గౌరవ వేతనం ఇప్పించాలి. పాస్టర్లు, మందిరాల మీద దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. శిథిలావస్థకు చేరుకున్న మందిరాల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు నిధులు ఇవ్వాలి. పాస్టర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. మీరు అధికారంలోకి వచ్చాక పాస్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్ని కోరారు.  నారా లోకేష్ స్పందిస్తూ రాష్ట్రంలో రాజకీయ లబ్ధికోసం జగన్ ప్రభుత్వం కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతోంది. క్రిస్టియన్ మైనారిటీలకు చెందిన వేల కోట్ల ఆస్తులను జగన్ అండ్ కో కబ్జా చేశారు. క్రైస్తవ శ్మశాన వాటికలను సైతం వైసిపి దొంగలు వదిలిపట్టడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ప్రార్థనా మందిరాలు, శ్మశానవాటికలకు ప్రహరీగోడలు నిర్మిస్తాం. పాస్టర్లకు ఇళ్లస్థలాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రార్థనామందిరాలపై దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.


లోకేష్ ను కలిసిన తిమ్మపాలెం గ్రామస్తులు : కొండపి నియోజకవర్గం తిమ్మపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.మా గ్రామ సమీపంలోని అటవీ భూమిని తాతల కాలం నుండి సాగుచేసుకుంటున్నాం. మేమంతా సన్న, చిన్నకారు రైతులం. వైసీపీ ప్రభుత్వం అడవి పోరంబోకు భూముల్లోకి మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటోంది. దీంతో మేమంతా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరు అధికారంలోకి వచ్చాక మేం సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలి. మేము సాగుచేసుకునే భూమిపై శాశ్వత హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  లోకేష్ స్పందిస్తూ రైతులను ఏదోవిధంగా ఇబ్బంది పెట్టడం జగన్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని, దీర్ఘ కాలంగా రైతులు సాగుచేసుకుంటున్న భూముల్లోకి రైతులను వెళ్లనీయకపోవడం అన్యాయమన్నారు.

Comments