ఉపాధి హామీలో కూలీల సంఖ్యను మరింత పెంచాలి.

 ప్రజలలో సంతృప్తి స్థాయి పెంచే విధంగా స్పందన  జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారం ఉండాలి


*: ఉపాధి హామీలో కూలీల సంఖ్యను మరింత పెంచాలి*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి ,జూలై 17 (ప్రజా అమరావతి): 


*జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ లను పరిష్కారంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.*


*పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను 260 స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ,  డి ఆర్ డి  ఏ పి డి నరసయ్య,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి   260 అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై  కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

ప్రజలలో సంతృప్తి స్థాయి పెంచే విధంగా స్పందన జగనన్నకు చెబుదాం అర్జీలకు పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా అర్జీలకు పరిష్కారం చూపించడం అత్యంత ముఖ్యమన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలను పరిష్కరించాని, అర్జీలు వచ్చిన వెంటనే పరిశీలించి సత్వర పరిష్కారం చూపించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు.*


*అనంతరం వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమస్యలపై సమావేశం నిర్వహించాలని సర్కులర్ జారీ చేసిందని,  ఈనెల 14వ తేదీన  పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన   సమావేశం నిర్వహించారు, ఈనెల 21వ తేదీన మడకశిర  నియోజకవర్గానికిసంబంధించిన  వ్యవసాయ మరియు ఇంజనీరింగ్ కళాశాల నందు  మడకశిర  నియోజకవర్గ అభివృద్ధి పనులపై జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యే సమావేశానికి హాజరవుతారని, సమావేశ నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.  మడకశిర నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాల్లో ఆయా మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, హౌసింగ్, తదితర శాఖల జిల్లా అధికారులు  కచ్చితంగా పాల్గొనాలని తెలిపారు , నియోజకవర్గంలో నాడు నేడు, హౌసింగ్, మైనింగ్, సిమెంటు,  గతంలో వర్షాల వల్ల నష్టపోయిన పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు

  మడకశిరనియోజకవర్గ సమావేశం కోసం ఆయా శాఖల అధికారులు ఈనెల 19వ తేదీ సాయంకాలం లోపు నియోజకవర్గ వివరాలు  సిపిఓ కు అందజేయాలన్నారు. ఎమ్మెల్యే లేవనెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు కోసం కృషి చేయాలని, ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతిరోజు లక్ష మంది కూలీలకు పనులు కల్పించాలని లక్ష్యం ఉండగా, ప్రస్తుతం 65,000 మంది మాత్రమే ప్రతిరోజు పనులకు వస్తున్నారని, కూలీల సంఖ్యను మరింత పెంచాలన్నారు. జిల్లాలోని రామగిరి, పెనుకొండ, రొద్దం, తదితర మండలాల పరిధిలో కేటాయించిన లక్ష్యానికి గాను 20 శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటున్నారని, చిలమత్తూరు మండలంలో 25 శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటున్నారని, కేటాయించిన లక్ష్యాలను చేరుకునేందుకు మరింత పురోగతి చూపించాలన్నారు. లేబర్ మొబిలైజేషన్, ప్లాంటేషన్, ఎస్సీ, ఎస్టీ ప్లాంటేషన్ కు సంబంధించి ఎక్కడ నుంచి లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమం   అన్ని మండలాల్లో బాగా జరుగుతున్నాయని, 

జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలకు సంబంధించి గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాలకు సంబంధించి కేటాయించిన లక్ష్యానికి ఒకటి కూడా తగ్గకుండా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. నిలిచిపోయిన భవనాలను మళ్లీ మొదలు పెట్టాలని, వేగంగా నిర్మాణాల్లో చేపట్టాలని, పూర్తయిన భవనాలకు సంబంధించి బిల్లులు అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్టేజి మార్పు అన్నది ఖచ్చితంగా జరగాలన్నారు. ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాల్సిన భవన నిర్మాణాలను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని, సెప్టెంబర్ 15 నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. నిర్మాణాలు వేగవంతం జరిగేలా సర్పంచులు, ఎంపీటీసీలను ఎంపీడీవోలు మోటివేట్ చేయాలన్నారు.


ఈ సందర్భంగా స్పందన కార్యక్రమానికి వచ్చిన పలు అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.*


1.  నల్లచెరువు మండలం  నాయన వారి పల్లి నివసించే  ఎం నారాయణ  సర్వే నంబర్ 54-5   నందు నాలుగు ఎకరాల. 51 సెంట్లు భూమి  ఉన్నది పట్టాదార్ పాస్ పుస్తకం మరియు వన్ బి మంజూరు చేయవలసిందిగా  వినతలు అందజేశారు


2 బత్తలపల్లి మండల,  మూల్యవంత గ్రామానికి చెందిన కులయప్పని నేను మట్టిని, మరియు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు  నివారించవలసిందిగా వినతుల అందజేశారు.


ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లాడిపిఓ విజయ్ కుమార్, డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి, డిసిహెచ్ఎస్ డా.ఎం.టి.నాయక్, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డ్వామా పిడి రామాంజనేయులు, సోషల్ వెల్ఫేర్ శివరంగ ప్రసాద్, బిసి వెల్ఫేర్ డిడి నిర్మల జ్యోతి, గ్రామ / వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*






-

Comments