రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందే!*రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందే!


*


*- వెంటిలేటర్ పై ఉన్న రైతన్నను మళ్లీ నిలబెడతాం.*


*- జగన్ పాలనలో 3వేల రైతు ఆత్మహత్యలు.*


*- జగన్ ప్రభుత్వ విధానాలతో సాగు భారమై రైతులు అప్పులపాలు*


*- గంజాయి సాగుతప్ప మరేసాగూ సాగడంలేదు*


*- ఫ్రస్టేషన్ తో బూతులు తిట్టడంకాదు, రైతాంగానికి ఏంచేశారో సమాధానం చెప్పండి*


*- అన్నదాతతో ప్రతిరైతుకి రూ.20వేలు ఇస్తాం. గతంలో అమలుచేసిన అన్ని పథకాలు పునరుద్ధరిస్తాం.*

                                                                                                                                                    ★ మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు విలేకరుల సమావేశం మాట్లాడుతూ

అమరావతి (ప్రజా అమరావతి);

★ రైతన్న వెంటిలేటర్ పై ఉంటే ముఖ్యమంత్రిలో స్పందనలేదు... వ్యవసాయ రంగం ఎంతసంక్షోభంలో కూరుకుపోతుందో చెప్పడానికి వైసీపీ నాలుగేళ్లపాలనే నిదర్శనం. ఖరీఫ్ ప్రారంభమైనా రాష్ట్రంలో ఇప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఇప్ప టివరకు 27శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. నెల్లూరులో మరీ తక్కువగా 42 శాతం, చిత్తూరులో 36, కడప 48, అనంతపురం 26, కర్నూలు 28, తూర్పుగోదా వరి 42, పశ్చిమగోదావరిలో 40శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 1నాటికే వర్షాలు పడి, ఇప్ప టికే చాలావరకు సాగు ప్రారంభం కావాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతులపరిస్థితి, వ్యవసా య స్థితిగతులపై ఇంతవరకు సమీక్ష చేసిందిలేదు. ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచించింది లేదు. ఎటువంటి ప్రణాళికలు తయారుచేయలేదు. నాలుగేళ్లలో సాగును చంపేసి, రైతును ముంచేశాడు. రైతులపై ప్రేమ, బాధ్యత  వ్యవసాయంపై అవగాహన లేదు. రైతన్న నేడు వెంటిలేటర్ పై ఉన్నాడు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి.                                                                                                                                                                                                        నాలుగేళ్లలో 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నాలుగేళ్లలో రైతులకు అప్పలు తప్ప ఈ ప్రభుత్వం ఒరగబెట్టింది శూన్యం. రాష్ట్రంలో గంజాయిసాగు తప్ప, ఏ సాగు అయినా బాగుందా?

రాష్ట్రంలో ఏ పంటవేసే రైతు అయినా బాగున్నాడా? పల్నాడు, గుంటూరు జిల్లాలు అనగానే మిర్చి, గోదావరిజిల్లాల పేరుచెప్పగానే ధాన్యం రైతులు, అనంతపురం జిల్లా లో వేరశనగ, కర్నూలుజిల్లాలో పత్తిరైతు, ఉత్తరాంధ్రలో జీడిరైతు వీరిలో ఒక్కరైనా బాగున్నారా?  ఏ ఒక్కరైతు అయినా ఈప్రభుత్వంలో నేను బాగున్నానని, బాగుపడ్డానని చెప్పే స్థితిలో ఉన్నాడా?  రాయలసీమను హర్టికల్చర్ హబ్ గా, కోస్తాను ఆక్వాహబ్ గా మార్చాలని పనిచేశాను. వాణిజ్యపంటల సాగువిస్తీర్ణం పెరిగేలా చర్యులు తీసుకు న్నాము. ఆహారపు అలవాట్లు మార్పుకు తగినట్టు పంటలమార్పిడిని ప్రోత్సహించా ము. జగన్మోహన్ రెడ్డి హాయాంలో, ఈ దుర్మార్గుడి పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగవుతున్నది గంజాయి పంటమాత్రమే. మరే ఇతరపంటల సాగుని ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నాలుగేళ్లలో 3వేలమందిరైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కౌలురైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రానిది రెండోస్థానం, రైతుల ఆత్మహత్యల్లో దేశంలో మూడోస్థానం. ఇవన్నీ ప్రమాదఘంటికలే. రాబోయే రోజుల్లో ఏమవుతుందోనన్న భయం. లెక్కల్లోచూపకుండా మోసం చేయడం. తప్పుడు లెక్కల్లో ఇతను సిద్ధహస్తుడు. వాస్తవంగా చనిపోయిన రైతుకుటుంబాలకు సాయంచేస్తే రూ.210కోట్లవరకు ఇవ్వాలి. కేవలం 672 మంది చనిపోయినట్టు చూపించి, రూ.47కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. రాష్ట్రంలో 93శాతం రైతాంగం అప్పులపాలైంది. సగటున ప్రతిరైతు పై రూ.2,45,554ల అప్పు ఉంది. దేశంలోచూస్తే రూ.74వేలుఉంది. దేశంకంటే రాష్ట్రం 4 రెట్ల ఎక్కువ అప్పులు రైతులపై వేసింది. ఈ అప్పులు తప్ప రైతులకు ఒరగబెట్టింది శూన్యం. దీనికంతటికీ కారణం ప్రభుత్వం అవలంభిస్తున్న రైతువ్యతిరేక విధానాలే.

ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలు, పాలకు అధికారవ్యామోహం, దోపిడీ రాష్ట్రానికి శాపంగా మారింది.

రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో భూములవిలువ పెరుగుతుంది. సాగునీరు అందుబాటులో ఉంటే విస్తీర్ణంతోపాటు, భూమివిలువ పెరుగుతుంది.  అలానే పరిశ్ర మలు, రోడ్లువస్తే విలువ పెరుగుతుంది. దానివల్ల వ్యవసాయంలో నష్టపోయినా భూమి ని అమ్ముకొని రైతులు ఒడ్డెక్కేవారు. ఒకప్పుడు ఇక్కడ రైతాంగం ఒకఎకరా అమ్మి హైదరాబాద్ లో 4, 5ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఒకఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనే పరిస్థితి. ఎవరు కారణం దీనికి?   ఈ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు,  మీ అధికారవ్యామోహం, దోపిడీ రాష్ట్రానికి శాపంగా మారింది. ధాన్యం రైతులు గిట్టుబాటుధరలేక తీవ్రంగా నష్టపోయాడు. రూ.1530లు ఇవ్వాల్సి ఉంటే, రూ.1000లు కూడా ఇచ్చిందిలేదు. ఆర్.బీ.కే లు (రైతుభరోసా కేంద్రాలు) అన్నారు. అవి దోపిడీ కేంద్రాలుగా మారాయి. వ్యవస్థల్ని పూర్తిగా రివర్స్ గేర్ లో నడిపించి, వాటిని చంపేశాడు. దాని ప్రభావం రైతులపై పడింది. కరోనా సమయం లో ఎవరూ బయటకురాలేదు..కానీ రైతులు పంటలు పండించి, దేశానికి అన్నం పెట్టా రు. అలాంటి రైతులకు పంట పండించడానికి, పంటఉత్పత్తులు అమ్ముకోవడానికి అన్నింట్లో కష్టాలే. ధాన్యం రైతులకు సరైన గోతాలు ఇవ్వలేకపోయారు. మొన్న వరదలు వచ్చి తూర్పుగోదావరిలో వరిపైరు దెబ్బతిని రైతులునష్టపోతే, వారిని ఆదు కున్నారా? పౌరసరఫరాల శాఖమంత్రి రైతుల్ని వెర్రిపప్పలు అంటాడు. తాము పండిం చిన పంటఉత్పత్తులు కొనమంటే, దానికి రైతుల్ని అవహేళన చేస్తారా? మంత్రులు రై తుల్ని చులకనగా చూస్తుంటే, ముఖ్యమంత్రి ఒక్కరోజైనా ఒక్కరైతువద్దకు వెళ్లి పంట లు పరిశీలించి, ధైర్యంచెప్పాడా? ఒక్కరైతునైనా పరామర్శించాడా? ఈ సంక్షోభానికి కా రణం ఈ ముఖ్యమంత్రి కాదా? అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత ఉందా? తడిచిన ధాన్యం కొనేవారు లేరు. రైతులే కష్టాలుపడి మిల్లర్లవద్దకు తీసుకెళ్తే వారు కొనరు. తేమశాతంపేరుతో దోపిడీ. ధాన్యం రైతులు ఈ ప్రభుత్వంలో తీవ్రంగా నష్ట పోయారు.

 

*మిర్చి, పత్తి, వరి, వేరుశనగ సహా అన్నిపంటలు, ఆక్వాసాగుని సంక్షోభంలోకి నెట్టారు.*


★ మిర్చి రైతుల పరిస్థితి మరీ దారుణం. నల్లతామర వచ్చి  4లక్షల ఎకరాల్లోల మిరప పైరు దెబ్బతిన్నది. మిర్చిరైతులు చితికిపోతే పట్టించుకున్న నాథుడు లేడు. రాష్ట్రంలో అసలు వ్యవసాయశాఖే లేదు. ఆశాఖను మూసేశాడు. ఒకప్పుడు వేరుశనగ పైరు కాపాడటానికి స్ప్రింక్లర్ పద్ధతి తీసుకొచ్చాము. మొత్తం పంట కాపాడతామని కాదు.. రైతులకు ఒకభరోసా ఇవ్వడానికి ఆనాడు పనిచేశాము. ప్రభుత్వం అలాచేస్తేనే అధికా రులు శ్రద్థతో పనిచేస్తారు. అనంతపురం జిల్లాలో ప్రధానపంట వేరుశనగ. ఈ సంవత్స రం 7లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గింది. కేరళ తర్వాత ఉత్తరాంధ్రలోనే జీడిపప్పు సాగు ఎక్కువ. ఒకప్పుడు జీడిపిక్కల బస్తా రూ.15వేలు ఉంటే, ఇప్పుడు రూ.7వేలకు పడి పోయింది. మరోపక్క ఆక్వారంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఒకప్పుడు  ఆక్వాసా గు లక్షా 40వేల హెక్టార్లు ఉంటే, దాన్ని 2లక్షల హెక్టార్లకు పెంచాము. ఆక్వా ఎగుమతు ల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలిపాము. ఈ రోజు ఏమైంది.. రూ.72వేలు ఉండే ఫీడ్ ధర రూ.90వేలకు పెరిగింది. తమప్రభుత్వం ఆరోజు ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్ రూ.2లకే అందించాము. ఇతను రూ.1.50పైసలకు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు రూ.3.85 పైసలు చేశాడు. తాముఅధికారంలోకి వస్తే  ఆక్వారైతులకు రూ.1.50 పైసలకే ఇస్తామని చెప్పాము. వాటర్ సెస్సు గతంలో 1000లీటర్లకు రూ.12 లు ఉంటే, ఇతను వచ్చి దాన్ని రూ.120కి పెంచాడు. గోదావరి, కృష్ణా నదులున్న ఈ రాష్ట్రంలో  ఈదౌర్భాగ్యపు పరిస్థితి ఎందుకొచ్చింది? టీడీపీప్రభుత్వం పట్టిసీమద్వారా ఆక్వారైతులకు నాణ్యమైన నీరు అందించింది. నీటితో సహా అన్నిధరలు పెంచి  ఆక్వా రైతుల  నడ్డి విరగ్గొట్టారు.


*ముఖ్యమంత్రికి ముందుచూపు లేదు.. అన్నీ దొంగచూపులు అడ్డదారులే.*


 ఉద్యానవన పంటల సాగుకు  రాయలసీమ వాతావరణం అనుకూలిస్తుందని నమ్మి, సీమను హర్టికల్చర్ హబ్ గామార్చి అరటి, బొప్పాయి, దానిమ్మ వంటి పంటలసాగుని ప్రోత్సహించాము. అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానంతో సాగు విస్తీర్ణం పెంచాము. సింహా ద్రిపురం మండలం అరటిసాగులో జీఎస్డీపీ గ్రోత్ లో మూడో మండలంగా నిలిచింది. నీళ్లులేక చీనీతోటలు ఎండిపోతుంటే, నీళ్లు అందించాము. ఆయిల్ పామ్ సాగుని తొలి సారి ఏపీకి తీసుకొచ్చింది తెలుగుదేశ ప్రభుత్వమే. అలాంటి ఆయిల్ పామ్ ని పూర్తిగా నాశనంచేశారు. సబ్సిడీలు ఎత్తేశారు. మొక్కలు ఇవ్వడంలేదు. బ్లాక్ మార్కెట్లో విక్ర యిస్తున్నారు. హర్టికల్చర్ విభాగం ఏంచేస్తోంది?  ఒకరైతు రాయలసీమలో 22 ఎకరాల్లో టమాటా వేస్తే రూ.3కోట్ల ఆదాయంవచ్చింది. దానిపై ఆలోచిస్తే ఎప్పుడైతే ధరలు తగ్గుతున్నాయో, అప్పుడు రైతులకు ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఆర్థికసాయం చేయకపోవడంతో, రైతులు ఈ పంటలు వేస్తే తాము నష్టపోతామనే భావనకు వచ్చేశారు. దాంతో చాలాపంటల సాగుకి స్వస్తిచెప్పారు. రైతులు పండించిన పంటలు నేరుగా అమ్ముకోవడంకోసం రైతుబజార్లు ఏర్పాటు చేశాం. 2014లో మొబైల్ రైతుబజార్లు పెట్టాం. అదేసమయంలో అన్నిరైతుబజార్లలో రైతుల ఉత్పత్తులకు ఒకేధర లభించేలా చేశాం. చివరకు రైతుల ఉత్పత్తుల్ని చౌకధరల దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంచాము. రోడ్డుపై ఊరికే పడేసేకంటే పేదలకు అందిస్తే మంచిదని భావించాం. కొన్ని ఉత్పత్తులధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం రైతులకు కనీస గిట్టుబాటు ధర అందించి, ఉత్పత్తులు కొని వినియోగుదారులకు అందించింది. రైతులు వరిసాగు మానేస్తున్నారు. దాంతో బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. అమెరికా లోని ఇండియన్స్ బియ్యంరావన్న భయంతో, ఎగబడి కొంటున్నారు. ముందుచూపు తో కరెక్ట్ గా పనిచేస్తే ఇలాంటిపరిస్థితి రాదు. ఈ ముఖ్యమంత్రికి అన్నీ దొంగచూపులు, అడ్డదారులే.

టీడీపీహాయాంలో వ్యవసాయంలో 11శాతం వృద్ధిరేటు. ఛాలెంజ్ చేస్తున్నా..మీరు సాధించింది ఏమిటో చెప్పండి?

టీడీపీప్రభుత్వంలో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ పెట్టి, ఐదేళ్లలో రూ.41,194కోట్లు ఖర్చు పెట్టాము. రెగ్యులర్ బడ్జెట్ తో సంబంధంలేకుండా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జె ట్ పెట్టి, 5.81శాతం కేటాయింపులు చేశాం. వృద్ధిరేటులో ఆనాడు 11శాతం పురోగతి సాధించాము. స్వాతంత్ర్యం వచ్చాక వ్యవసాయంలో ఐదేళ్లపాటు 11శాతం వృద్ధిరేటు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. మేం సాధిం చింది ఇదని. మీరు వచ్చి ఏంచేశారు? 4.16శాతానికి వ్యవసాయబడ్జెట్ తగ్గించారు. ఇరిగేషన్ రంగానికి మేం రూ.64వేలకోట్లు ఖర్చుపెట్టాం. 62 సాగునీటిప్రాజెక్టులకు ప్రా ధాన్యత ఇచ్చి, 24పూర్తిచేశాం. 32లక్షల ఎకరాల్ని స్థిరీకరించాము. 7లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చాము. కాలువలు బాగుచేసి, సాగునీటి సంఘాల సమన్వయంతో నీరు  చివరి ఆయకట్టువరకు అందేలా చేశాము. ఈ నాలుగేళ్లలో సాగునీటిరంగాన్ని పట్టించుకున్నారా?  ఇరిగేషన్ రంగానికి ఎంతఖర్చుపెట్టి, ఎన్నిఎకరాలు కొత్తగా సాగు లోకి తెచ్చారో సమాధానం చెప్పండి. భూమినే జలాశయంగా మార్చడానికి  కరువు ప్రాంతాల్లో 6లక్షల పంటకుంటలు తవ్వించాము. రైతురథం కింద రూ.4వేలకోట్లు ఖర్చుపెట్టి, 23వేల ట్రాక్టర్లుఇచ్చాము.. మీరు 6వేల ట్రాక్టర్లు కూడా ఇవ్వలేదు. సాగు భూముల్లో ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి, అవసరమైన జిప్సం, బోరాన్, ఇతర ఖనిజాల్ని రైతులకు ఉచితంగా అందించాము. మనిషి శరీరానికి విటమిన్స్, ఖనిజాలు ఎలా అవసరమో, భూమికికూడా సూక్ష్మపోషకాలు అవసరమని భావిం చాము. యాంత్రీకరణతో వ్యవసాయ ఖర్చు తగ్గించాము. రూ.3,759కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ తాము రైతులకు అందిస్తే, మీరు ఈ నాలుగేళ్లలో రూ.1965కోట్లతో సరిపెట్టారు. మైక్రో ఇరిగేషన్ కు తమప్రభుత్వం రూ.1250కోట్లు ఖర్చుపెట్టి, రాయలసీమలో 10లక్షల ఎకరాలకు 100శాతం సబ్సిడీ అందించాము. మీరు వచ్చాక 2లక్షలఎకరాల కు కూడా ఇవ్వలేదు. రూ.3,556కోట్ల ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటుచేశాము. వీళ్లు రూపాయి పెట్టలేదు. రైతు రుణమాఫీ కింద రూ.15,279కోట్లు రైతులకు అందించాం. రూ.50వేలలోపు రుణాల్ని ఒకేసారి మాఫీచేశాం. తెలంగాణ రూ.లక్ష రుణమాఫీ అంటే,   ఇక్కడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని లక్షాయాభైవేలు మాఫీచేశాం. ఇబ్బందిలేకుం డా తాము రైతులకు విద్యుత్ అందించాము.

అప్పులకోసం రైతులమోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. అప్పులసొమ్ముతో ఈయన విలాసాలు చేయాలి...రైతులు పేదలు మాత్రం రోడ్డునపడాలి.

ఈ ప్రభుత్వం రైతులమెడలకు ఉరితాళ్లు బిగించేలా మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమైంది. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడురాష్ట్రాలు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు. రైతాంగం ఏమైపోయినా పరవాలేదు.. ఈయనకు మాత్రం అప్పులు కావాలి. అప్పులు తెచ్చి ఆ సొమ్ముతో విలాసాలు చేయాలి. పేదలు రైతులుమాత్రం రోడ్డునపడాలి. జెడ్.బీ.ఎన్.ఎఫ్ (జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్) ప్రకృతి వ్యవసాయం తీసుకొచ్చాము. పద్మశ్రీ అవార్డు గ్రహీత  సుభాష్ పాలేకర్ తో రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించాము. తొలిసారి 5లక్షల ఎకరాల్లో జెడ్.బీ.ఎన్.ఎఫ్ పద్ధతిలో సాగుచేపట్టాము. తర్వాత వివిధ కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహాయసహకారంతో ప్రకృతి వ్యవసాయాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపాము. కర్నూలుజిల్లా నందికొట్కూరులో మెగాసీడ్ హబ్ పార్క్ ఏర్పాటుచేశాము. ప్రపంచానికి అవసరమైన విత్తనాలు ఇక్కడినుంచే అందించాలన్న లక్ష్యంతో పనిచేశాము. అలాంటి ప్రాజెక్ట్ ను  ఆపేశారు. అది సాకారమై ఉంటే రాయలసీమ దేశానికే విత్తనరాజధానిగా నిలిచేది. ఇవన్నీ ఒకెత్తు అయితే, వ్యవసాయం బలోపేతానికి కేంద్రప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకోకుండా దుర్వినియోగం చేశారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, జాతీయ ఆహారభద్రతా మిషన్, జాతీయ ఆయిల్ పామ్ మిషన్, జాతీయ నూనెగింజల సాగు, వ్యవసాయవిస్తరణ, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సుస్థిర వ్యవసాయ జాతీయ మిషన్. ఇలాంటి అనేక పథకాలకు కేంద్రప్రభుత్వమే 50 నుంచి 60శాతం నిధులిస్తుంది. మిగులు నిధు లు ఇవ్వలేక ఈప్రభుత్వం వాటిని పూర్తిగా అటకెక్కించింది. తాగునీరు అందించే కేంద్రపథకాన్ని దేశంలో ఒక్క ఏపీప్రభుత్వమే వినియోగించుకోలేదని కేంద్రమంత్రి చెప్పారు. పేదవాడికి పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి  ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. పక్క రాష్ట్రంలో ఇదే పథకాన్ని 100శాతం అమలుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వచ్చేది పేదలనుంచే. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు,  స్థానికసం స్థలు కలిసి ప్రజల జీవితాలు బాగుచేయాలి. వాటికి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నేరుగా నిధులిస్తారు. జీఎస్టీ, ఇతరపన్నులద్వారా ఆదాయం వస్తుంది. వచ్చే ఆదాయా న్ని సంక్షేమానికి, అభివృద్ధికి వినియోగించకుండా, కేంద్రప్రభుత్వ నిధుల్ని వినియోగిం చుకోకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.

పంటలబీమా పథకానికి తూట్లుపొడిచి రైతుల్ని వంచించాడు. 


*పంటనష్టపరిహారం కింద ఈయన ఇచ్చిన సొమ్ము రైతులు టీ తాగడానికి సరిపోతుందా?*


★ కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు, రైతుల భాగస్వామ్యంతో పంటలబీమా పథకం అమలయ్యేది. దానివల్ల వర్షాలు, ఇతర ప్రకృతివిపత్తులకు పంటలు నష్టపోతే, రైతులకు సాయం అందే ది. పంటనష్టం కింద రైతులకు కొంతభరోసా ఉండేది. దాన్ని తీసేసిన ఈ ముఖ్యమంత్రి, పంటలబీమా సొమ్ము కట్టకుండా రైతుల్ని వంచించాడు. 2019-20లో పంటలబీమా సొమ్ము కట్టామని అసెంబ్లీలో బుకాయించాడు. జీవో చూపించమని నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో నేలపై కూర్చుంటే, గప్ చుప్ గా సాయంత్రం డబ్బుకట్టారు. అప్పటికే ఆల స్యమైంది. దాంతో రైతులు నష్టపోయారు. 2020-21, 2021-22లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వద్దు..నేనే సొంతంగా బీమా పెడతాను అన్నాడు. బీమా పథకం పెట్టకుండా మాటలుచెప్పి రైతుల్ని మరోసారి వంచించాడు. పంటలు నష్టపోయిన రైతు లకు మూడేళ్లలో ఒక్కరూపాయి అందలేదు. పంటలబీమా పథకాన్ని వర్గీకరించి రైతు లకు అన్యాయంచేశాడు. వాతావరణ బీమాకింద టమాటాసాగుచేసిన రైతుకు ఎకరాకు రూ.130ల పరిహారం అందించాడు. ప్రకాశం జిల్లాలో లక్ష్మారెడ్డి అనేరైతు ఎకరం15 సెంట్లలో వరిపైరువేస్తే అతనికి రూ.36.50పైసల పరిహారం ఇచ్చారు. పిచ్చయ్య అనే  మరోరైతుకి ఎకరాకు రూ.32లు అందించారు. ఏమిటిది.. మీరుఇచ్చిన సొమ్ము రైతుల కు టీతాగడానికి సరిపోతుందా? ఇదేనా రైతులపై మీకున్న ప్రేమ, బాధ్యత? రైతుల్ని ఆదుకునే విధానం ఇదేనా? దౌర్భాగ్యం కలిసొచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజలు ముఖ్యంగా రైతులు నాశనమయ్యే పరిస్థితికి వచ్చారు. ఎన్నికలకు ముందు గిట్టుబాటు ధర ఇస్తానన్న ఈ వ్యక్తి, రూ.3వేలకోట్ల స్థిరీకరణ నిధి పెడతాను.. రూ.4వే లకోట్ల ప్రకృతి విపత్తుల సహాయనిధి పెడతాను అన్నాడు. పెట్టాడా.. పెడితే  ఎంతమం ది రైతుల్ని ఆదుకున్నాడు? వరదలు, అకాలవర్షాలకు నష్టపోయిన రైతులముఖం  చూడలేదు. నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హతఉందా? తమప్రభుత్వం మిర్చిపంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.1500 పరిహారం అందించింది. మొక్కజొన్న, జొన్న రైతులకు క్వింటాల్ కు రూ.200లు అందించాము. శనగలు, పత్తి, పామాయిల్, ఇలా అన్ని పంటలకు పరిహారం అందించాము. మీరు చేసింది ఏమిటయ్యా అంటే మద్ధతు ధర అడిగిన రైతుపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వినుకొండలో ఒక రైతుతన బాధ చెప్పుకుంటే, అతన్ని జైల్లో పెడతారా? రాజధానికి భూములిచ్చిన రై తులకు సంకెళ్లు వేసి, జైల్లో పెడతారా?  ఆఖరికి ఎస్సీ, ఎస్టీ రైతులపై కూడా అట్రాసిటీ కేసులు పెట్టే దుస్థితికి దిగజారారు.

రైతుల చొరవ, త్యాగాన్ని బూడిదలో పోసిన పన్నీరుచేసిన ఈ వ్యక్తి పెద్దదానకర్ణుడిలా పేదలకు ఇళ్లస్థలాలంటున్నాడు. 

అమరావతి ప్రజారాజధాని. ఈ మాట మేంచెప్పడం కాదు.. ప్రపంచంలోని అన్ని దేవా లయాలు, మసీదులు, చర్చిల్లోని పవిత్రమైన నీటిని, మట్టితో పూజలుచేసి సత్సం కల్పంతో నిర్మాణాలు తలపెట్టాము. నిన్న ఈయన పేదలకు ఇళ్లసలాలిస్తూ, పెద్ద దానకర్ణుడిలా మాట్లాడాడు. రైతుని రైతుగా గౌరవించకుండా కులం, మతం, ప్రాంతం అంటగట్టి సిగ్గుఎగ్గులేకుండా ఏది పడితే అదిమాట్లాడతారా? సుప్రీంకోర్టు చెప్పింది.. హై కోర్టు ఇచ్చేసిందని చెబుతున్నాడు. రైతులు ముందుకొచ్చి చూపిన చొరవను, వారి త్యాగాన్ని బూడిద లో పోసిన పన్నీరు చేశాడు. రాజధాని ఏదంటే తెల్లముఖం వేసే పరి స్థితి కల్పించాడు. ఎవరైనా తల్లిదండ్రులు తమపిల్లల్ని మనరాజధాని ఏది అని అడిగితే వారేం సమాధానం చెబుతారు? ఎన్నికలకు ముందు ప్రతి రైతుకి రూ.12,500లు ఇస్తానన్న ఈ పెద్దమనిషి రూ.7,500లు ఇస్తున్నాడు. కేంద్రమిచ్చే సొమ్ముని కలిపి ఇస్తూ, తానే ఇస్తున్నట్టు చెబుతున్నాడు. అదికూడా రాష్ట్రంలోని రైతులందరికీ ఇస్తు న్నాడా అంటే లేదు. అరకొరగా తనకు నచ్చినవారికి ఇస్తూ, రైతుల్నికూడా వర్గీకరిం చాడు. రాజధానిలోని కౌలురైతులకు పైసా ఇవ్వలేదు. ప్రతిరైతుకి రైతుభరోసా కింద  రూ.67,500లుఇస్తామనిచెప్పి రూ.37,500లు మాత్రమే ఇస్తూ, రూ.30వేలు ఎగ్గొట్టా డు. మరి ఆనాడు మేం ప్రతిరైతుకి ఒకేసారి రూ.50వేలు ఇచ్చాము. అది గొప్పా.. ఐదే ళ్లకు రూ.37,500లు ఇవ్వడం గొప్పా? దానిలో కూడా సంవత్సరానికి మూడు ఇన్ స్టాల్ మెంట్లు. ఇంతోటి గొప్పదానికి మరలా బటన్లు నొక్కడం.

 

★ ప్రభుత్వరైతువ్యతిరేక విధానాలు, ముఖ్యమంత్రి పాలసీలే రైతుల ఆత్మహత్యలకు కారణం. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత వృద్ధిలోకి వచ్చినా రైతు పండిస్తేనే తినాలి

రాష్ట్రప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలు, ముఖ్యమంత్రి అవలంభించిన పాలసీలతో దేశంలో ఏపీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా రైతులఆత్మహత్యలు చాలాతక్కువగా ఉన్నాయి. విభజనజరిగాక గోదావరి, కృష్ణా నదులు అందుబాటులో ఉండి, బంగారం పండే మంచిభూములు ఉండి రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? ఎటువంటి పంటలైనా పండించే భూ ములు మనవి? పండించిన ఉత్పత్తుల్ని ఎగుమతిచేసుకునే అవకాశముంది. అయినా రాష్ట్రంలో ఒక్కో రైతుపై రూ.2.45లక్షల అప్పుఉండటం ఏమిటి? 93శాతం రైతులపై అప్పులభారం ఏమిటి? ఈ ఆత్మహత్యలు ఏమిటి? రైతుబాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుంది. మనంతినే ప్రతిమెతుకు రైతునుంచే వస్తుంది. ఆ రైతే లేకపోతే ఎవరూ ఏమీచేయలేరు. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత వృద్ధిలోకి వచ్చినా అందరూ అన్నమే తినాలి.

                                                                                                                                                                                       ★ వెంటిలేటర్ పై ఉన్న రైతుని ఆరోగ్యవంతుడిని చేసి, వ్యవసాయాన్ని పండగగా మార్చడానికే ‘అన్నదాత’ తీసుకొచ్చాం. సాగుకి అండగా నిలిచేలా త్వరలోనే నూతన వ్యవసాయపాలసీ ప్రకటిస్తాం.

 వెంటిలేటర్ పై ఉన్న రైతన్నను ఆరోగ్యకరంగా మార్చి, వ్యవసాయాన్ని పండగగా మార్చడానికే ‘అన్నదాతా సుఖీభవ’ పథకం తీసుకొచ్చాము.ఈ పథకం కింద ప్రతిరైతు కి ఏడాదికి రూ.20వేల అందిస్తామనిచెప్పాము. అలానే గతంలో తమప్రభుత్వం అందిం చిన అన్నిపథకాల్ని మరలా పునరుద్ధరిస్తాం. సాగుకి అండగా నిలిచేలా త్వరలోనే నూతన వ్యవసాయ పాలసీ ప్రకటిస్తాం. ఈ మోసకారీ జగన్ రెడ్డిని రైతులు ఎప్పటికీ క్ష మించరు.  రైతుబతకాలంటే జగన్ పోవాల్సిందే. జగన్ పోతేనే రైతాంగం బాగుంటుంది. తమకష్టాలకు ఎవరు కారణమో, తమ భవిష్యత్ ఎందుకు అంధకారమైందో ప్రతిరైతు ఆలోచించాలి. రైతులజీవితాల్ని చీకట్లలో మగ్గేలా చేసింది ఈ వైసీపీప్రభుత్వం. మేం మాట్లాడిన వాటిపై బూతులు మాట్లాడటంకాదు.. నాలుగేళ్లలో రైతులకు, వ్యవసాయా నికి చేసిన మేలుపై తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయండి. మేం చెప్పిన వి అబద్ధమ ని నిరూపించండి. నిరూపించలేపోతే మీరు పరిపాలనకు అనర్హులని ఒప్పు కొని వైదొలగండి. నేను పోరాడేది అధికారంకోసం కాదు.. 5కోట్లప్రజలకోసం రాష్ట్ర రైతాం గం కోసం. జనాభాలో 70శాతం రైతుల, రైతుకూలీలే ఉన్నారు. వారు బతుకుతోంది వ్యవసాయంపై ఆధారపడే.


_*విలేకరుల ప్రశ్నలకు చంద్రబాబు  స్పందన...*_


ఎక్స్ పైరీ డేట్ ముగిసిన మందుని పక్కనపెట్టి, ఏ మందువాడాలో ప్రజలు నిర్ణయించు కోవాల్సిన సమయం వచ్చింది.

మనిషిని బాగాకొట్టి దెబ్బలతో బాధపడుతుంటే, పుండుపై కారంచల్లి పైశాచిక ఆనందం పొందుతున్నారు. రైతులు అలాంటి పరిస్థితిలో ఉంటే పంనష్టం పరిహారం కింద ఎంగిలి మెతుకులు వేస్తారా? రూ.15లు ఇచ్చి దాంతో బతకాలంటారా? ఒకసారి నేను అనంత పురం వెళ్తే, అక్కడి రైతాంగం పరిస్థితిచూసి వారికి ఇన్ పుట్ సబ్సిడీ అందించాలని నిర్ణయించాను. అధికారులు వద్దన్నారు. పదేళ్లలో అనంతపురంలో 6, 7 సంవత్సరా లు కరువే ఉంటుంది. 3, 4 ఏళ్లలోపండే పంటలతో పదేళ్లు బతకాలి. అలాంటి రైతులకు పెట్టుబడిగ్యారంటీ అయినా ఉంటుందని ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఒకప్పుడు అనం తపురం జిల్లాలో పశువులకోసం నీళ్లు, గ్రాసం అందించాము. క్యాంపులుపెట్టి, 2, 3 నెలలు పశువుల్ని మేపి, తర్వాత రైతులకు అప్పగించాం. అలాంటి జిల్లాలను ఆదుకో వాలనే ఉద్దేశంతోనే అనంతపురం జిల్లారైతులకు ఇన్సూరెన్స్ తో పాటు, ఇన్ పుట్ సబ్సిడీ అందించాము. తాము రెండూ ఇస్తే, ఇప్పుడు వీళ్లు 15రూపాయలు ఇచ్చి వె క్కిరిస్తారా? నిరాశా, నిస్పృహలు ఓటమి భయంతో ఉన్న వైసీపీనేతలు బూతులు మాట్లాడతారని తెలుసు. ఏంచేశారో ప్రజలకు చెప్పండి. ప్రజలకు చెప్పడానికి ముందుకు రాని వారిని ఏంచేయాలో ప్రజలే ఆలోచించాలి. ఏ వస్తువు అయినా ఎక్స్ పైరీ డేట్ రాగానే పక్కనపెట్టేస్తాం. ఈ ప్రభుత్వానికి కూడా ఎక్స్ పైరీ డేట్ వచ్చేసింది. ఉంచాలో..దించాలో ఆలోచించాల్సింది ప్రజలే. ఈ పనిచేయని మందుకి ఎక్స్ పైరీ డేట్ వచ్చింది... అలానే ఈ మందుని పక్కనపెట్టి, ఏమందు వాడాలో కూడా ప్రజలే ఆలో చించాలి. ఎగిరెగిరిపడుతున్న వైసీపీనేతలకు త్వరలోనే తగినచోటు చూపిస్తాను. కేసు లు పెడితే భయపడతారనో, ఓట్లు మేనిప్లేట్ చేసి గెలవచ్చనో, మీ ఇష్టప్రకారం చేస్తే ఏం చేయాలో అదిచేస్తాం. ప్రజల్లో చైతన్యం కోసం, భావితరాల భవిష్యత్ కోసమే తెలుగు దేశం పనిచేస్తుంది. అందుకే చెపుతున్నా రైతు బతకాలంటే....జగన్ పోవాల్సిందే.

Comments