బడికి వెళ్ళే వయస్సు గల పిల్లల్లో ఏ ఒక్కరూ కూడా బడి బయట వుండకూదు.


నెల్లూరు (ప్రజా అమరావతి);


బడికి వెళ్ళే వయస్సు గల పిల్లల్లో  ఏ  ఒక్కరూ కూడా  బడి బయట వుండకూడదని




, అందరూ బడికి వెళ్ళే  విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం. హరి నారాయణన్,   సంభందిత అధికారులను అదేశించారు.


సోమవారం కలెక్టరేట్లోని ఎస్. ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్సు  హాల్ నుండి జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు, ఎం.ఈ.ఓ లు,  సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై    జిల్లాలో   జరుగుచున్న మన బడి నాడు- నేడు  అభివృద్ధి పనుల పురోగతి , జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ, IFP డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు,  జగనన్న గోరుముద్ద  కార్యక్రమం అమలు తదితర అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు, సూచనలు ఇవ్వడం జరిగింది.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ మాట్లాడుతూ,  1 నుండి 12వ తరగతి చదివే పిల్లలందరూ  బడిలోనే వుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  క్షేత్ర స్థాయిలో  విద్యా శాఖాధికారులు, ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వెల్ఫేర్ అసిస్టెంట్స్, వాలంటీర్స్ బాధ్యత వహించి  బడి ఈడు పిల్లలందరూ  బడిలోనే వుండేలా  ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రవేటు పాఠశాలలను, జూనియర్ కళాశాలలను భాగస్వాములు చేసి  మిషన్ మోడ్ లో నూటికి నూరు శాతం   ఈ కార్యక్రమం అమలు జరగాలని స్పష్టం చేసారు. మండలాల వారిగా  మనబడి నాడు నేడు కింద జరుగుచున్న పనుల పురోగతి పై సమీక్షిస్తూ పాఠశాలల్లో, జూనియర్  కళాశాలల్లో  పెండింగ్ లో ఉన్న రెండో విడత  నాడు నేడు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని  జిల్లా కలెక్టర్ , ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జూనియర్  కళాశాలలకు సంబంధించి జిల్లా వొకేషనల్ అధికారి సంబంధిత  ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని పెండింగ్ లో ఉన్న రెండో విడత  నాడు నేడు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా వొకేషనల్ అధికారిని ఆదేశించారు.  ఈ నెలాఖరు నాటికి వంద శాతం జగనన్న విద్యా కానుక కిట్స్ పంపిణీ జరగాలని,   ఈ నెలాఖర్ నాటికి పెండింగ్  వున్న సంబంధిత ఎంఈఓ లు,  ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్ పై  చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. IFP డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మండల విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.   అన్నీ పాఠశాలల్లో  జగనన్న గోరుముద్ద కార్యక్రమం పటిష్టంగా అమలు జరగాలని,  స్కూల్స్ కు వచ్చే పిల్లలందరూ  మధ్యాహ్న భోజనం తీసుకునేలా  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.  మునిసిపల్ ప్రాంతాల్లో జగనన్న గోరుముద్ద  కార్యక్రమం పటిష్టంగా అమలు జరిగేలా   శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమీషనర్లను ఆదేశించారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని, సమగ్ర శిక్ష ఎపిసి ఉషారాణి,  ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్ఈలు రంగవర ప్రసాద్, అశోక్ కుమార్, ఐటిడిఏ పిఓ మందా రాణి, ఐసిడిఎస్. పిడి  హేనా సుజన్, జిల్లా వొకేషనల్ అధికారి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. 


Comments