జిల్లాలో నాడు నేడు రెండో విడత పనులను త్వరితగతన పూర్తి చేసేందుకు చర్యలు

 

అల్లూరు, జూలై 25 (ప్రజా అమరావతి);  జిల్లాలో నాడు నేడు రెండో విడత పనులను త్వరితగతన పూర్తి చేసేందుకు చర్యలు


చేపట్టినట్లు  జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ పేర్కొన్నారు. 


మంగళవారం సాయంత్రం అల్లూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, మండల పరిషత్ పాఠశాలలో చేపట్టిన నాడు నేడు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని  పాఠశాలల్లో మొదలైన నాడు నేడు రెండో విడత పనులు వర్షాల కారణంగా కాస్త జాప్యం జరిగిందని, త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. 


అల్లూరు సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

.................... 

అల్లూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనకాలజీ, సర్జికల్, వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 


కలెక్టర్ వెంట ఆర్డీవో శీనా నాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్  కట్టా వెంకటేశ్వర్లు, తాసిల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో శ్రీదేవి, వైద్యులు ఉన్నారు. 

.

Comments