సోషల్ మీడియా మాథ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.

 *సోషల్ మీడియా మాథ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి*



*బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి*


*పురంధేశ్వరి ని కలిసిన బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి*


*నేడు పురందేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం*


*విజయవాడ, (ప్రజా అమరావతి) : బూత్ స్థాయి నుంచి వాట్స్ ప్ గ్రూప్ లు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ పధకాల ను సోషల్ మీడియా మాథ్యమం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు. బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్ అధ్యక్షతన శనివారం  రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధులతో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. భారతమాత ఫొటో కి పూలమాల వేసి  బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పధకాల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారనే అంశాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పై విపక్షాలు చేస్తున్న దుష్ట ప్రచారం తిప్పి కొట్టాలన్నారు. సోషల్ మీడియా మాథ్యమం ద్వారా మాత్రమే ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పధకాలు వివరించి వచ్చే ఎన్నికలకు మనం సమాయత్తం కావాల్సి న అవసరం ఉందన్నారు.  బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు తదితరులు మాట్లాడారు.  సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్  బిజెపి సోషల్ మీడియా చేస్తున్న కార్యక్రమాలు ఎల్ఈడీ స్క్రీన్ పై ప్లే చేశారు.*

 

*పురంధేశ్వరి ని కలిసిన బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురంధేశ్వరి ని రాష్ట్ర కార్యాలయం లో బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో లీగల్ సెల్ కమిటీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పురంధేశ్వరి ని శాలువా తో సత్కరించారు. లీగల్ సెల్ సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మాట్లాడుతూ బిజెపి ని బలోపేతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి లీగల్ సెల్ సభ్యులు అందరూ కామన్ సివిల్ కోడ్ బిల్లు విషయంలో అన్ని వర్గాల వారి కి అవగాహన కల్పించాలన్నారు. కామన్ సివిల్ కోడ్ ఆవశ్యకత వివరిస్తే ప్రజలు ఆమోదం తెలపడమే కాదు వ్యతిరేకించే రాజకీయ నేతల్లో కూడా బిల్లు విషయంలో పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉంటుందన్నారు. కామన్ సివిల్ కోడ్ బిల్లు బిజెపి అజెండా లోని అంశం ఈ అంశం పై జాతీయ స్థాయిలో అనేక సందర్భాల్లో అవగాహన కల్పిస్తూ రావడం జరుగుతోందన్నారు. కామన్ సివిల్ కోడ్ పై అవగాహన కల్పించేందుకు బిజెపి లీగల్ సెల్ సభ్యులు అందరూ కృషి చేస్తారని అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి లీగల్ సెల్ కన్వీనర్ ప్రతాప్ రెడ్డి హామీ ఇచ్చారు.*


*నేడు పురందేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం*


ఏపీ బీజేపీ  అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పదాధికారులతో పాటు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి నేతలు హాజరు కానున్నారు. ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయాలు బీజేపీ భవిష్యత్తు ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. బీజేపీ అంతర్గత వ్యవహారాలతో పాటు నూతన కమిటీ ఏర్పాటుపై సమీక్ష చేయనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో కమిటీలను వాటి నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికార పార్టీని టార్గెట్‌గానే వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్న బీజేపీ అదిష్టానం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments