అసాంఘిక శక్తుల ప్రలోబాలకు లోను కాకుండా తల్లిదండ్రులు మరియు గురువుల మాట విని శ్రద్ధగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి.రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);ఆదివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు స్థానిక   వై జంక్షన్ సమీపంలో గల సాంఘిక సంక్షేమ విద్యార్ధినుల వసతి గృహం నందు  ప్రపంచ మానవ అక్రమ రవాణా బాధితుల దినోత్సవం సందర్బంగా న్యాయ విజ్ఞాన సదస్సు మరియు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ప్రత్యూష కుమారి  మాట్లాడుతూ అక్రమ రవాణా నివారణ చట్టం - 1986, నల్సా వారి అక్రమ రవాణా మరియు లైంగిక దోపిడి బాధితుల పథకం, 2015, మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. వసతి గృహం విద్యార్దినులను ఉద్దేశించి ఎటువంటి అసాంఘిక శక్తుల ప్రలోబాలకు లోను కాకుండా తల్లిదండ్రులు మరియు గురువుల మాట విని శ్రద్ధగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని


తెలిపారు. ఎటువంటి న్యాయ పరమైన సహాయం అవసరమైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలియచేశారు.  ఆదేవిదంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు డి.ఎం.హెచ్.ఓ, రాజమహేంద్రవరం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఉచిత వైద్య శిబిరంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ప్రత్యూష కుమారి  మాట్లాడుతూ జీవితంలో పలు అనారోగ్య సమస్యలు రావడం సహజమే కానీ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండ వచ్చునని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో పలు డెంగ్యూ, మలేరియా, బీ.పీ, షుగరు మరియు మొదలగు పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్ది నులందరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పరీక్షల అనంతరం విద్యార్దినులకు మందులు అందజేశారు. 


ఈ వైద్య శిబిరంలో వివిధ విభాగాల వైద్యనిపుణులు డా. లలిత, డా. దేవి ప్రియాంక, సబ్ యూనిట్ ఆఫీసర్  జి. కె. సింగ్, ల్యాబ్ టెక్నీషియన్లు, వసతి గృహ సంక్షేమ అధికారులు, ఆశా కార్యకర్తలు, మరియు పారా లీగల్ వాలంటీర్ శ్రీమతి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. 
Comments