ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన సాంఘిక సంక్షేమశాఖమంత్రి.


అమరావతి (ప్రజా అమరావతి);


క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన సాంఘిక సంక్షేమశాఖమంత్రి


మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరు కనకారావులు.


2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్ధులు, పోరాటసంఘాల కార్యకర్తలపై అప్పటి ప్రభుత్వం నమోదుచేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ గడిచిన కొంతకాలంగా వివిధ దళిత సంఘాలు విజ్ఞప్తి.


దళిత సంఘాల వినతిని ఇవాళ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ దృష్టికి తీసుకునివస్తూ... కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావులు.


కేసుల ఉపసంహరణకు సానుకూలంగా స్పందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

Comments